Health Tips: ఈ సమయంలో స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అనారోగ్యం బారిన పడే ఛాన్స్ ఉంది..!
Health Tips: జీవనశైలి సక్రమంగా ఉంటే.. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే.. మనం ఎప్పుడు లేచాం, ఏం తింటున్నాం, ఎప్పుడు నిద్రపోతున్నాం,
Health Tips: జీవనశైలి సక్రమంగా ఉంటే.. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే.. మనం ఎప్పుడు లేచాం, ఏం తింటున్నాం, ఎప్పుడు నిద్రపోతున్నాం, ఇవన్నీ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అన్నీ సరైన సమయంలోనే చేస్తేనే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. అలా కాకుండా క్రమరహిత విధానాలు అవలంభిస్తే మాత్రం దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవనశైలిలో స్నానం కూడా కీలకమైనదే. స్నానం ఎప్పుడు చేస్తున్నామనేది కూడా చాలా కీలకం. చాలా సార్లు తప్పుడు సమయంలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి స్నానం చేయడానికి సరైన సమయం ఏంటి? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
స్నానం ఏ సమయాల్లో చేయాలి.. సాధారణంగా చాలా మంది ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తారు. దీని వల్ల రోజంతా ఫ్రెష్‌గా ఉంటారు. బద్ధకం కూడా ఉండదు. అలాగే సాయంత్రం పూట తలస్నానం చేసినా ఆరోగ్య పరంగా మేలు జరుగుతుంది. దీని వల్ల రోజంతా శరీరానికి అంటుకున్న మురికి, చెమట వల్ల వచ్చిన క్రిములు శరీరం నుంచి తొలగిపోతాయి. అయితే సాయంత్రం పూట స్నానం చేసేటప్పుడు వాతావరణం, సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆలస్యం అయితే, స్నానం చేయవద్దు. వాతావరణం బాగానే ఉండి, ఆలస్యం కాకపోతే ప్రతిరోజూ సాయంత్రం స్నానం చేయవచ్చు. సాయంత్రం పూట తలస్నానం చేయడం వల్ల రక్తపోటు, ఒత్తిడి సమస్య కూడా తగ్గుతుంది.
ఈ సమయంలో స్నానం చేయడం ఆరోగ్యానికి హానీకరం.. తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిద్రపోయే ముందు లేదా నిద్ర లేచిన వెంటనే స్నానం చేయకూడదు. ఇది అనారోగ్యానికి కారణం అవుతుంది. ఈ నేపథ్యంలో స్నానం చేయడానికి ముందు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.
మళ్లీ మళ్లీ స్నానం చేయొచ్చా.. కొంతమంది వేసవి కాలంలో తరచుగా స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేస్తే బాగుంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో, మీరు రెండుసార్లు కంటే ఎక్కువ స్నానం చేయవచ్చు. అలా కాకుండా ఎప్పుడుపడితే అప్పుడు స్నానం చేయడం వల్ల, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు తలెత్తుతాయి.
వర్షంలో తడిసిన తర్వాత స్నానం చేయాలి.. వర్షంలో తడిసిపోతే ఖచ్చితంగా స్నానం చేయాలి. వర్షం కురిసే సమయంలో వాతావరణంలో ఉండే బాక్టీరియా, మురికి శరీరంపై పేరుకుపోతుంది. అందుకే వర్షంలో తడిసిన తర్వాత ఇంట్లో శుభ్రమైన నీటితో స్నానం చేయాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..