Independence Day: భారత ప్రజలకు పాకిస్తానీ ఆర్టిస్ట్ సర్‌ప్రైజ్‌ వీడియో గిఫ్ట్.. నెట్టింట వీడియో వైరల్

దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలు దేశాధినేతలు కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Independence Day: భారత ప్రజలకు పాకిస్తానీ ఆర్టిస్ట్ సర్‌ప్రైజ్‌ వీడియో గిఫ్ట్.. నెట్టింట వీడియో వైరల్
Siyal Khan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 15, 2022 | 8:24 PM

Pakistani Musician’s Gift To India: దేశవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వాడవాడల జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పలు దేశాధినేతలు కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దయాది దేశం పాకిస్తాన్ నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

కాగా.. దయాది దేశం నుంచి వచ్చిన ఓ గ్రీటింగ్ ఇంటర్నెట్‌లో ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది. పాకిస్థాన్‌కు చెందిన రబాబ్ ప్లేయర్ సియాల్ ఖాన్ భారత జాతీయ గీతాన్ని ప్లే చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఇది నెట్టింట వైరల్ గా మారింది. రబాబ్ అనేది గిటార్‌ను పోలిన ఒక వాయిద్యం. ఇది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్‌లో బాగా ప్రాచుర్యం పొందింది.

ఇవి కూడా చదవండి

వీడియో..

వీడియోలో.. సియాల్ ఖాన్ పర్వతాల మధ్య కూర్చొని.. రబాబ్‌ (గిటార్‌) వాయిస్తూ ‘జన గణ మన’ను ప్లే చేశాడు. సరిహద్దులో ఉన్న నా వీక్షకులకు ఇదిగో బహుమతి అంటూ జనగణమన ప్లే చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఒక నిమిషం 22 సెకన్ల పాటు ఉన్న సియాల్ ఖాన్ వీడియో నెట్టింట అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ పాకిస్థాన్‌ రబాబ్‌ ప్లేయర్‌.. వీడియో గిఫ్ట్‌ఫై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి లైకులు చేస్తున్నారు. దీంతోపాటు సియాల్‌ ను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..