Healthy Food: ఓట్స్ తో రుచిక‌ర‌మైన విందు.. ఓ సారి తింటే ఇక వ‌ద‌ల‌రు..

నేటి ఆధునిక కాలంలో ప్రతి వ్యక్తి త‌న ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ముఖ్యంగా ఓ వ్యక్తి తీసుకునే ఆహారంతో పాటు పాటించే ఆరోగ్య నియ‌మాల‌పై అత‌డి ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. ఇటీవ‌ల కాలంలో..

Healthy Food: ఓట్స్ తో రుచిక‌ర‌మైన విందు.. ఓ సారి తింటే ఇక వ‌ద‌ల‌రు..
Oats
Follow us
Amarnadh Daneti

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 17, 2022 | 2:37 PM

Healthy Food: నేటి ఆధునిక కాలంలో ప్రతి వ్యక్తి త‌న ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ముఖ్యంగా ఓ వ్యక్తి తీసుకునే ఆహారంతో పాటు పాటించే ఆరోగ్య నియ‌మాల‌పై అత‌డి ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. ఇటీవ‌ల కాలంలో మంచి పోష‌కాలు ఉండే ఆహారాన్ని తీసుకోవ‌డం కోసం చాలా మంది ఓట్స్ ను ఎంచుకుంటున్నారు. ఓట్స్ ని బ్రేక్ పాస్ట్ గా తీసుకునే వారు పాల‌ల్లో క‌లిపి తీసుకోవ‌డం ఎక్కువ చూస్తుంటాం. విట‌మిన్లు, పోష‌క ఆహార ప‌దార్థాలు ఎక్కువుగా ఉండ‌టంతో ఓట్స్ పై మ‌క్కువ చూపిస్తున్నారు. కాని రోజూ పాల‌ల్లో క‌లిపి తాగ‌డం వ‌ల్ల చాలా మందికి దానిపై ఇష్టం త‌గ్గుతుంది. అలాంటి వాళ్లు ఓట్స్ తో ఎన్నో ర‌కాల రుచిక‌ర‌మైన విందును త‌యారుచేసుకోవ‌చ్చు. ఓట్స్ ఇప్పుడు అనేక ఫ్లేవ‌ర్స్ లోనూ ల‌భిస్తున్నాయి. ఓట్స్ తో ఏమేమి త‌యారుచేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఓట్స్ తో చాట్: సాయంత్రం స‌మ‌యంలో ఆక‌లివేస్తే సాధార‌ణంగా బ‌య‌ట చాట్ తింటుంటాం. అది అంత ఆరోగ్య‌క‌రం కాద‌ని తెలిసినా.. ఆటైంలో ఆక‌లి తీర్చుకోవ‌డానికి ఏదో ఒక‌టి తింటాం. ఇలా సాయంత్రం స‌మ‌యంలో ఓట్స్ తో కూడా చాట్ ను చేసుకోవ‌చ్చు. ఇది బ‌య‌ట తినే చాట్ తో పోలీస్తే ఎంతో ఆరోగ్యంక‌రం. కేవలం 20 నిమిషాల్లో ఓట్స్ తో రుచిక‌ర‌మైన చాట్ ను చేసుకోవ‌చ్చు. ఈచాట్ త‌యారు చేసుకోవ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఎంటో చూద్దాం.. కావలసినవి: నార్మల్ ఓట్స్, పఫ్డ్ రైస్, మొలకెత్తిన పెస‌లు, వేయించిన వేరుశెనగలు, సన్నగా తరిగిన దోసకాయ ఒక‌టి, సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన టమోటా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, నిమ్మరసం, చాట్ మసాలా, చింతపండు గుజ్జు, దానిమ్మ గింజలు, సన్నగా తరిగిన కొత్తిమీర, న‌ల్ల మిరియాల‌ పొడి.

తయారీ విధానం: ఓట్స్‌, పఫ్డ్ రైస్‌ను కలిపి 5 నిమిషాల పాటు తక్కువ మంటపై నెయ్యి వేయకుండా రోస్ట్ చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆతర్వాత పచ్చి కొత్తిమీర, దానిమ్మపండు మినహా అన్ని పదార్థాలను కలపాలి. సర్వింగ్ డిష్ లో వేసుకున్న పచ్చి కొత్తిమీర, దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈచాట్ ను ఎంత మందికి చేసుకోవాలనుకుంటే దానికి తగిన పరిణామంలో పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. ఓట్స్ బాదం షేక్: ఓట్స్ తో బాదం షేక్ తయారుచేసుకోవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది.ఈ బాదం షేక్ వ్యక్తికి అవసరమైన ఎనర్జీని ఇస్తుంది.

కావల్సిన పదార్థాలు: నార్మల్ వోట్స్, చియా విత్తనాలు, స్కిమ్డ్ మిల్క్, నానబెట్టిన బాదం, తేనె, సన్నగా తరిగిన బాదం, యాలకుల పొడి

తయారీ విధానం: చియా గింజలు, బాదంపప్పులను ఒక టేబుల్ స్పూన్ నీటిలో 15 నిమిషాలు నానబెట్టాలి. బాదం పప్పు తొక్కలను తీసి. మిక్సీ జార్‌లో తరిగిన బాదం తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా బ్లెండ్ చేయాలి. దీన్ని సర్వింగ్ గ్లాస్‌లో పోసి తరిగిన బాదంపప్పులతో అలంకరించి సర్వ్ చేసుకోవచ్చు.

3. ఓట్స్ పుడ్డింగ్: ఆరోగ్యకరమైన డెజర్ట్ తినాలనుకునేవారికి ఓట్స్ పుడ్డింగ్ మంచి డెజర్ట్ గా చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ గా తయారుచేసుకోవచ్చు.

కావల్సిన పదార్థాలు: నార్మల్ ఓట్స్, పాలు, మాప్లే సిరప్, వనిల్లా ఎక్స్ ట్రాక్ట్

తయారీ విధానం : ఓట్స్, పాలు, మాప్లే సిరప్, వనిల్లా ఎక్స్ ట్రాక్ట్ ను ఒక జార్ లో వేసి కలుపుకోవాలి. జార్ కు మూతపెట్టి షేక్ చేయాలి. కనీసం 6 గంటల పాటు ఫ్రిజ్ లో కూలింగ్ అయిన తర్వాత దీనిని తినొచ్చు. ఇలా ఓట్స్ తో ఎన్నో రుచికమైన పదార్థాలను తయారుచేసుకుని ఆరగించవచ్చు. ఓట్స్ తో తయారుచేసుకునే వాటిలో పోషకాలు ఎక్కువుగా ఉంటాయి. దీంతో వీటన్నింటిని ఆరోగ్య కరమైన ఆహారంగా తీసుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఇది కూడా చదవండి..టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

మరినని హెల్త్ వార్తల కోసం చూడండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే