Viral Photo: స్టైల్‏గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నోడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ .. సౌత్‏లో స్టార్ హీరో..

ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. తెలుగుతోపాటు తమిళ్ ఇండస్ట్రీలోని ఈ కుర్రాడు సుపరిచితమే. హీరోయిజమే కాకుండా కంటెంట్ నచ్చితే ఎలాంటి పాత్రలైన చేయడానికి సిద్ధంగా ఉంటారు.

Viral Photo: స్టైల్‏గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నోడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ .. సౌత్‏లో స్టార్ హీరో..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 15, 2022 | 4:55 PM

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ పిక్చర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరి ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్న పలువురు సెలబ్రెటీల చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసింటారు. అయితే పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి. సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. తెలుగుతోపాటు తమిళ్ ఇండస్ట్రీలోని ఈ కుర్రాడు సుపరిచితమే. హీరోయిజమే కాకుండా కంటెంట్ నచ్చితే ఎలాంటి పాత్రలైన చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటీవలే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ హీరోను గుర్తుపట్టండి.

పైన ఎంతో స్టైలీష్ గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నోడు మరెవరో కాదు క్రేజీ హీరో కార్తి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ హీరో యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఊపిరి మూవీతో హిట్ అందుకున్న కార్తి.. ఇటీవల ఖైదీ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో కార్తి నటనకు దక్షిణాది ఆడియన్స్ ఫిదా అయ్యారు. తమిళ్ స్టార్ హీరో సూర్య తమ్మడిగా.. నటనతో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా విరుమంమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం విడుదలై ఈ మూవీ తమిళనాట వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.