Liger Movie: ‘ఆ విషయం తెలిసి 2 కోట్లు తీసుకోకుండా పంపించాడు’.. విజయ్ పై పూరి ఆసక్తికర కామెంట్స్..

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని చూస్తూ నా కళ్లు విజయ్ పై ఆగిపోయాయి. ఆ సమయంలోనే ఈ కుర్రాడితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

Liger Movie: 'ఆ విషయం తెలిసి 2 కోట్లు తీసుకోకుండా పంపించాడు'.. విజయ్ పై పూరి ఆసక్తికర కామెంట్స్..
Puri Jagannadh Vijay
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 15, 2022 | 12:17 PM

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నలేటేస్ట్ చిత్రం లైగర్ (Liger ). ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. నార్త్‏లోని ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించిన టీం.. ఇక ఆదివారం వరంగల్ వేదికగా ఫ్యాన్‏డమ్ టూర్‏లో పాల్గోంది. ఈ వేదికపై డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించారు.

“డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని చూస్తూ నా కళ్లు విజయ్ పై ఆగిపోయాయి. ఆ సమయంలోనే ఈ కుర్రాడితో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అతనిలో నచ్చేది నిజాయితీ. కొంచెం కూడా పొగరు ఉండదు. ఎంతో నిజాయితీగా చేశాడు. ఒక నిర్మాతగా దేవరకొండకు కోటి రూపాయాలు ఇస్తే వద్దు ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండని అన్నాడు. ఆ తర్వాత రెండు కోట్లు పంపిస్తే.. మాకు అప్పులు ఉన్నాయని తెలిసి ఆ డబ్బును తిరిగి పంపించేశాడు. ఈ రోజుల్లో ఇలా ఎవరంటారు. విజయ్ నాన్నాగారు మా అబ్బాయిని ఒక కొడుకులా చూసుకొని సినిమా తీయ్ అన్నారు. కానీ విజయ్ నన్ను ఒక తండ్రిలా చూసుకొని నా కష్టాల్లో నాతోపాటు నిల్చున్నాడు. విజయ్ లాంటి హీరోను నేను చూడలేదు. ఇక మైక్ టైసన్ సినిమాలో నటించడమనేది ఛార్మి వల్లే సాధ్యమైంది. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే