Life Style: రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు బిజినెస్ దిగ్గజాల హఠాన్మరణం.. కారణం ఇదేనా..

ప్రముఖ వ్యాపారి ఇన్వెస్టర్ రాకేష్ జున్ జున్ వాలా గుండెపోటు కారణంగా ఆగష్టు 14వ తేదీన ప్రాణాలు కల్పోగా.. ఒక రోజు ముందు అంటే ఆగష్టు 12వ తేదీన ఏస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, డ్యుయిష్ బ్యాంక్ AG మాజీ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్షు జైన్..

Life Style: రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు బిజినెస్ దిగ్గజాల హఠాన్మరణం.. కారణం ఇదేనా..
Work from home
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 17, 2022 | 1:41 PM

Life Style: దేశంలోని పేరొందిన ఇద్దరు బిజినెస్ టైకూన్లు కేలవం 48 గంటల వ్యవధిలో అనారోగ్య కారణాలతో మరణించారు. వీరిలో ప్రముఖ వ్యాపారి ఇన్వెస్టర్ రాకేష్ జున్ జున్ వాలా గుండెపోటు కారణంగా ఆగష్టు 14వ తేదీన ప్రాణాలు కల్పోగా.. ఒక రోజు ముందు అంటే ఆగష్టు 12వ తేదీన ఏస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, డ్యుయిష్ బ్యాంక్ AG మాజీ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్షు జైన్ క్యాన్సర్ కారణంగా చనిపోయారు. వీరిద్దరి మృతికి తీవ్రమైన ఒత్తిడి, జీవనశైలిలో మార్పులే కారణమై ఉండొచ్చని SRL టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ అభా సభిఖి అభిప్రాయపడ్డారు. అదనపు ఒత్తిడి కారణంగా హార్మోన్లపై ప్రభావం పడుతుందని ఆమె తెలిపారు. వీరిద్దరి మృతిని గమనిస్తే వారి యొక్క బిజీ షెడ్యూల్, జీవనశైలిలో మార్పులే కారణమా అనే ప్రశ్న తలెత్తుతుంది. పని ఒత్తిడే అనారోగ్యాలకు కారణమవుతుందనే ఆలోచన కలుగుతుంది. గతంలో పెద్ద వయస్కులలో మాత్రమే గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువ వచ్చేవి. ఇటీవల కాలంలో మధ్య వయస్కులతో పాటు.. చిన్న వయస్సు వారు గుండెపోటుకు గురవుతున్నారు.

ప్రధానంగా నేటి ఆధునిక యుగంలో పని ఒత్తిడి ఎక్కువ అవుతోంది. సమయానికి తినకపోవడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం, లైఫ్ స్టైల్ లో వస్తున్న మార్పుల కారణంగానే పిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని డాక్టర్ అభా సభిఖి వెల్లడించారు. ఒక వ్యక్తిలో గుండె పోటు రావడానికి 23 శాతం పని ఒత్తిడే కారణమని వైద్య అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒత్తిడి లేకుండా పనిచేస్తున్నవారితో పోలిస్తే సమయానికి మించి పనిచేసే ఉద్యోగాలు, స్వేచ్ఛాయుతమైన నిర్ణయాలు తీసుకోవడం, అభిప్రాయాలను చెప్పే అవకాశం లేని ఉద్యోగాలు చేసే వారిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువుగా వస్తున్నాయని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ కు చెందిన పరిశోధకులు తెలిపారు.

సామాజిక, ఆర్థిక పరిస్ధితులతో పాటు లింగ బేధాలు, వయస్సు వంటి వాటిని పరిగణలోకి తీసుకుని పరిశీలించినప్పటికి పని ఒత్తిడి కారణంగానే ఎక్కువ మంది గుండె పోటుతో మరణిస్తున్నారని ఈపరిశోధనా బృందానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ కు చెందిన మికా కివిమాకి పేర్కొన్నారు. మరోవైపు క్యాన్సర్ వంటి వ్యాధులు రావడానికి పని ఒత్తిడికి మధ్య ప్రత్యక్ష సంబంధం లేనప్పటికి.. ఒత్తిడిని ఎదుర్కోవడానికి జీవనశైలిలో చేసుకుంటున్న మార్పుల కారణంగా క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నట్లు ఈపరిశోధకులు వెల్లడించారు. ఉద్యోగ ఒత్తిడి, వయస్సు, లింగం, సామాజిక, ఆర్థిక స్థితి, ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి వాటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు.. పని ఒత్తిడి కారణంగా క్యాన్సర్ రాకపోయినా.. దాని కారణంగా ఏర్పడే ఇతర సమస్యలు క్యాన్సర్ కు దారితీయవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే