Viral Video: నువ్వూ వద్దు.. నీ ఐస్ క్రీమూ వద్దు.. బుడ్డోడితో తమాషా చేయబోతే కథ అడ్డం తిరిగింది..

సోషల్ మీడియా (Social Media).. సమస్త ప్రపంచాన్ని అరచేతిలో తీసుకొచ్చిన వేదిక. ఇందులో ఎన్నో అంశాలు రోజూ ఎందరో షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా అందరికీ చేరువైంది. ఇందులో నిత్యం...

Viral Video: నువ్వూ వద్దు.. నీ ఐస్ క్రీమూ వద్దు.. బుడ్డోడితో తమాషా చేయబోతే కథ అడ్డం తిరిగింది..
Ice Cream Funny Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 17, 2022 | 7:13 AM

సోషల్ మీడియా (Social Media).. సమస్త ప్రపంచాన్ని అరచేతిలో తీసుకొచ్చిన వేదిక. ఇందులో ఎన్నో అంశాలు రోజూ ఎందరో షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా అందరికీ చేరువైంది. ఇందులో నిత్యం ఎన్నో రకాల వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అవి అప్పటికప్పుడూ ట్రెండ్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ (Internet) లో తెగ చక్కర్లు కొడుతోంది. మీకు కోన్ ఐస్ క్రీమ్ తెలుసా.. మాకు కోన్ ఐస్ క్రీం తెలియకపోవడం ఏమిటి.. అందులో చాక్లెట్, వెనీలా, బట్టర్ స్కాచ్ ఇలా చాలా రకాల ఫ్లేవర్లు ఉన్నాయి అంటారా.. అవును. మీరు చెప్పింది కరెక్టే. అయితే ఐస్ క్రీం ఫన్ గురించి తెలుసా.. అదేనండి ఓ కోన్ లో ఐస్ క్రీం వేసి, మన చేతికి అందకుండా చేసే ఫన్నీ స్కిట్. ఇలాంటి వాటిలో ఐస్ క్రీమ్ మన చేతికి అందినట్టే అంది అందకుండా పోతుంది. చాలా సమయం శ్రమిస్తే గానీ అది మన చేతికి రాదు. చిన్నారులతో చేసే ఇలాంటి ఫన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో ఐస్ క్రీం అమ్మే వ్యక్తి వద్దకు ఓ చిన్నారి వస్తాడు. ఆ వ్యాపారి కోన్ లో ఐస్ క్రీం నింపి అతడి చేతికి ఇవ్వగానే కేవలం కోన్ మాత్రమే ఉంటుంది. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత ఆ బుడ్డోడికి చిర్రెత్తుకొచ్చింది. నువ్వూ వద్దు.. నీ ఐస్ క్రీమూ వద్దు అంటూ కోన్ ను కింద పడేసి కాలితో తొక్కేస్తాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ యూట్యూబ్ వేదికగా పోస్ట్ అయింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 4.5 మిలియన్ల మంది లైక్ చేశారు. వేల సంఖ్యలో కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..