AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తగ్గేదేలే అంటున్న రైతన్న.. కేరళకు మాత్రమే సొంతమైన పంటను ఆంధ్రాలో పండించి చూపాడు..

Andhra Pradesh: మన అన్నదాతలు తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. తాజాగా ఇదే అంశం మరోమారు నిరూపితమైంది. తెలుగు రాష్ట్రాల రైతుల కృషి..

Andhra Pradesh: తగ్గేదేలే అంటున్న రైతన్న.. కేరళకు మాత్రమే సొంతమైన పంటను ఆంధ్రాలో పండించి చూపాడు..
Mace Spice
Shiva Prajapati
|

Updated on: Aug 16, 2022 | 6:54 PM

Share

Andhra Pradesh: మన అన్నదాతలు తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. తాజాగా ఇదే అంశం మరోమారు నిరూపితమైంది. తెలుగు రాష్ట్రాల రైతుల కృషి ఏంటో దేశానికి చాటిచెప్పారు. మన పంట నేలల్లో పండని పంటలను కూడా పండించి ఔరా అనిపిస్తున్నారు. దేశంలో సుగంధ ద్రవ్యాలు వంటి సాగులో కొన్ని ప్రాంతాలు మాత్రమే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా చాలా మంది ఇష్టపడి తినే బిర్యానీ వంటి వంటకాల్లో వాడే కొన్ని పదార్థాలు ఆయా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది.

కానీ ఇప్పుడు వాటి సాగు తెలుగు నేలకు కూడా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన గుండ్ర అంబయ్య అనే రైతు తన పామాయల్ తోటలో అంతరపంటగా జాపత్రి, జాజికాయల మొక్కలు నాటారు. ఐదేళ్ల క్రితం కేరళ లోని తన బంధువుల వద్దనుండి 20 మొక్కలు తెచ్చి నాటారు అంబయ్య. అలా నాటిన మొక్కల నుంచి ఇప్పుడు పంట దిగుబడి మొదలయ్యింది. సహజంగా జాపత్రి, జాజికాయల పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. పంట చేతికి వచ్చేందుకు కూడా చాలాకాలం వేచి చూడాల్సి వస్తుంది. అయితే మార్కెట్‌లో డిమాండ్ కారణంగా జాపత్రి ధర కేజీ 2500 రూపాయలు. కాయలు అయితే 1000 రూపాయలు ఉంటుంది. ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంట పండించే రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.

ప్రయోగాత్మకంగా వేసిన పంట మంచి ఫలితాలు రావటంతో ఇప్పటికే కొందరు వ్యాపారులు జాపత్రి, జాజికాయలు కావాలని అడుగుతున్నట్లు రైతు తెలిపారు. అంతే కాకుండా ఈ పంటను పండించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కొందరు రైతులు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారని రైతు గుండ్ర అంబయ్య తెలిపారు. ఒక ఎకరం విస్తీర్ణంలో 80 మొక్కల వరకు వేసుకుని పండిస్తే బాగుంటుందని, త్వరలో మరింత ఎక్కువ విస్తీర్ణంలో మరిన్ని మొక్కలు వేస్తామని, పోక చెక్క, లవంగాలు వంటివి కూడా పండిస్తామని రైతు అంబయ్య అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇటువంటి పంటలపై దృష్టి సాధించి, సబ్సిడీలు వంటివి ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మార్కెట్లో మంచి ధర, అందుకు తగ్గ డిమాండ్ కూడా ఉన్న ఈ పంట సాగుని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. పామాయిల్ సాగులో అంతరపంటలను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా జాపత్రి విషయంలో కూడా రాయితీలు వర్తిస్తాయని అంటున్నారు. ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న ఈ పంట దిగుబడి, రైతుకి రాబడి వంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తగిన ప్రోత్సాహం అందిస్తామని ఉద్యానవన శాఖ అధికారులు కూడా చెబుతారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..