Andhra Pradesh: రైల్వేస్టేషన్‌లో కంగారుగా కనిపించిన వ్యక్తి.. అతడి బ్యాగ్ చెక్ చేయగా పోలీసులకు షాక్!

అది విజయవాడ రైల్వేస్టేషన్. ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. మూడో నెంబర్ ప్లాట్‌ఫాంపై ఓ వ్యక్తి కంగారుగా అటు ఇటూ..

Andhra Pradesh: రైల్వేస్టేషన్‌లో కంగారుగా కనిపించిన వ్యక్తి.. అతడి బ్యాగ్ చెక్ చేయగా పోలీసులకు షాక్!
Railway Station
Follow us

|

Updated on: Aug 16, 2022 | 8:02 PM

అది విజయవాడ రైల్వేస్టేషన్. ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. మూడో నెంబర్ ప్లాట్‌ఫాంపై ఓ వ్యక్తి కంగారుగా అటు ఇటూ తిరిగుతూ ఆర్‌పీఎఫ్ పోలీసుల కంట పడ్డాడు. వారికి అతడి కదలికలపై అనుమానమొచ్చింది. ఎంక్వయిరీ చేసిన పోలీసులకు ఆ వ్యక్తి నుంచి పొంతలేని సమాధానాలు వచ్చాయి. దీనితో అతడి దగ్గరున్న బ్యాగ్‌ను చెక్ చేయగా అసలు నిజం బయటపడింది. ఇంతకీ ఆ కథేంటంటే..!

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ పోలీసులు భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. భీమవరం నుంచి విజయవాడ వచ్చిన గోపి అనే యువకుడు ప్లాట్‌ఫాంపై కంగారుగా కనిపించగా.. పోలీసులు అతడ్ని ఎంక్వయిరీ చేశారు. ఇక ఆ వ్యక్తి బ్యాగ్‌లో రూ. 94 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. డబ్బు ఎవరిది.? ఏంటి.? అనే ప్రశ్నలు అడగ్గా.. గోపి నుంచి పొంతనలేని సమాధానాలు వచ్చాయి. దీనితో టాస్క్‌ఫోర్స్ అధికారులు గోపిని అదుపులోకి తీసుకోగా.. ఐటీ అధికారులు అతడి దగ్గర నుంచి డబ్బుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..