Viral: రెస్టారెంట్‌ టేబుల్ కింద వింత గుర్తు.. పరిశీలించి చూడగా.. వెలుగులోకి మైండ్ బ్లోయింగ్ నిజం!

ఓ వ్యక్తి ఎంచక్కా భోజనం చేసేందుకు స్థానికంగా ఉండే రెస్టారెంట్‌కు వెళ్లాడు. చక్కగా ఓ చెట్టు కింద కూర్చుని..

Viral: రెస్టారెంట్‌ టేబుల్ కింద వింత గుర్తు.. పరిశీలించి చూడగా.. వెలుగులోకి మైండ్ బ్లోయింగ్ నిజం!
Foot Prints
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 15, 2022 | 9:31 PM

ఓ వ్యక్తి ఎంచక్కా భోజనం చేసేందుకు స్థానికంగా ఉండే రెస్టారెంట్‌కు వెళ్లాడు. చక్కగా ఓ చెట్టు కింద కూర్చుని.. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో అక్కడ టేబుల్ కింద ఓ వింత గుర్తును చూశాడు.. సీన్ కట్ చేస్తే..

వివరాల్లోకి వెళ్తే.. నైరుతి చైనా ప్రావిన్స్‌ అయిన సిచువాన్‌లోని ఓ రెస్టారెంట్ టేబుల్ కింద 100 మిలియన్ సంవత్సరాల నాటి డైనోసర్ పాదముద్రలను ఔ హాంగ్‌టో అనే వ్యక్తి కనుగొన్నాడు. ఆ సమాచారాన్ని పరిశోధకులకు అందించడంతో.. డాక్టర్ లిడా జింగ్ నేతృత్వంలోని నిపుణుల బృందం అక్కడి చేరుకుంది.

పాదముద్రలు రెండు జాతుల సౌరోపాడ్‌లకు చెందినవని.. మరీ ముఖ్యంగా ఇవి బ్రోంటోసారస్‌ల గుర్తులను పరిశోధకులు తేల్చారు. వీటిని భూమిపై నివసించిన అతిపెద్ద జంతువులుగా పరిగణిస్తారు. ఈ డైనోసర్లు 8 మీటర్ల పొడవు ఉండగా.. 145 నుండి 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి జీవించి ఉన్నాయని పేర్కొన్నారు.

నగరాల్లోని నిర్మాణ పనులు ఇలాంటి అరుదైన శిలాజాలను అధ్యయనం చేసేందుకు కష్టతరం చేశాయని పరిశోధకులు చెప్పారు. ఈ పాదముద్రలు చాలా లోతుగా, స్పష్టంగా ఉన్నాయి. వాటి చుట్టూ ఓ కంచెను ఏర్పాటు చేశాం. అక్కడ రెస్టారెంట్ ఏర్పాటు చేయకముందు.. ఆ స్థలంలో ఓ కోళ్ల ఫారమ్ ఉండేది. ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న ధూళి, ఇసుక పొరలు పాదముద్రలను నాశనం చేయకుండా నిరోధించాయని నిపుణులు భావిస్తున్నారు.