Andhra Pradesh: సామాన్యులను వేధిస్తే ఊరుకునేది లేదు.. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి..
Andhra Pradesh: పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. అమాయకులను వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh: పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. అమాయకులను వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో కొందరు అలజడులు చేయాలని చూస్తున్నారని, వారికి పోలీసులు వంత పాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకులపై పోలీసుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయన్నారు. ప్రతిపక్షంలో ఉంటే రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా? అని పోలీసుల తీరునై ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ. తాడిపత్రిలో ఆదివారం అర్థరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న ఇద్దరు మహిళలపై కొందరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. క్షతగాత్రులు ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. జేసీ ప్రభాకర్ రెడ్డి వారిని పరామర్శించారు. బాధితులకు కొంత ఆర్థిక సాయం చేశారు. తాడిపత్రిలో నిత్యం దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇలాంటి వాటికి తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయాలని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సుమోటోగా కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పొలిటికల్ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌లు ఇస్తే పర్వాలేదు కానీ, సామాన్యులను వేధించొద్దని హితవు చెప్పారు జేసీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..