Viral Video: అరె ఇదెలా సాధ్యం.. నీటిపై నిలబడి.. వేగంగా పరిగెత్తి.. గందరగోళానికి గురి చేస్తున్న వీడియో

సామాజిక మాధ్యమాల్లో (Social Media) నిత్యం ఎన్నో వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. వీటిలో కొన్నింటిని చూశాక మన కళ్లను మనమే నమ్మలేం. అలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్...

Viral Video: అరె ఇదెలా సాధ్యం.. నీటిపై నిలబడి.. వేగంగా పరిగెత్తి.. గందరగోళానికి గురి చేస్తున్న వీడియో
Sitting On Water
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 17, 2022 | 6:51 AM

సామాజిక మాధ్యమాల్లో (Social Media) నిత్యం ఎన్నో వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. వీటిలో కొన్నింటిని చూశాక మన కళ్లను మనమే నమ్మలేం. అలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నీటి ఉపరితలంపై వేగంగా కదులుతూ చేపలు పట్టడాన్ని చూడవచ్చు. దీని వెనక రహస్యం ఏంటని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. ఈ వ్యక్తి దీన్ని ఎలా చేయగలిగాడని అయోమయానికి గురవతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో (Video) ప్రారంభంలో ఒక వ్యక్తి నీటి ఉపరితలంపై కూర్చున్నాడు. అంతే కాకుండా నీటిపై వేగంగా ముందుకు సాగిపోవడాన్ని చూడవచ్చు. అతని చేతిలో చేపలు పట్టేందుకు ఉపయోగించే వల ఉంది. అతను దానిని ఉపయోగించి చేపలను పట్టుకుంటున్నాడు. అయితే నీటిపై కూర్చొని గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వీడియో చూశాక నెటిజన్లు షాక్ అవుతున్నారు.

గందరగోళంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో కన్ఫ్యూజింగ్ పెర్స్‌పెక్టివ్ అనే ఖాతా ద్వారా పోస్ట్ అయింది. ‘ఇది ఎంత వేగంగా వెళుతుందో చూడండి’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకు 97 వేలకు పైగా వీక్షించగా, రెండున్నర వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఈ వీడియో నెటిజన్లను బాగా కలవరపెడుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన వారు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..