Ponguleti Srinivas Reddy: ఆకాశమంత పందిట్లో పొంగులేటివారి వేడుక.. రూ.250కోట్లతో అతిథి మర్యాదలు..!

పొంగులేటి కూతూరు రిసెప్షన్ కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భారీగా హజరుకానున్నారు. వీఐపీల కార్ల పార్కింగ్ కోసం..

Ponguleti Srinivas Reddy: ఆకాశమంత పందిట్లో పొంగులేటివారి వేడుక.. రూ.250కోట్లతో అతిథి మర్యాదలు..!
Sr Gardens
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2022 | 3:39 PM

Ponguleti Srinivas Reddy: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు వివాహ రిషేప్షన్ ఖమ్మంలో బుధవారం జరగనుంది.. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు..బుధవారం జరగనున్న వివాహ రిసెప్షన్ అదిరిపోయే రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో జరగనున్న ఈ బాహుబలి వేడుకకు తెలంగాణ చరిత్రలోనే నిలిచిపోయేలా భారీ ఏర్పాట్లు చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కూతురి వివాహ రిసెప్షన్‌ కోసం పొంగులేటి సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఆహ్వానాలు పంపారు.. దాదాపు మూడు లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు..25 ఎకరాల్లో రిసెప్షన్‌ వేదిక ..25 ఎకరాల్లో భోజన వేదికలు..మరో 100 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసారు.. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాగర్ కెనాల్ పై సొంత ఖర్చులతో రెండు స్టీల్ బ్రిడ్జి లు నిర్మించారు.. మూడు లక్షల మంది దాటినా చెక్కు చెదరకుండా ఉండేలా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన ఏకైక కూతురు పెళ్లివేడుకలు అంగరంగ వైభవంగా జరిపించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు స్వప్ని రెడ్డి పెళ్లి ఈనెల 12న రాత్రి ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. పొంగులేటి, రామసహాయం సురేందర్‌రెడ్డి కుటుంబసభ్యులు, పలువురు ఇతర ప్రముఖుల సమక్షంలో పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. బాలిలో జరిగిన పెళ్లి వేడుకకు తనకు అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యులు.. దాదాపు 5 వందల మందిని ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లారు పొంగులేటి. ఇక ఈనెల 17 బుధవారం నాడు ఖమ్మంలో రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలో ఏర్పాట్లు చేశారు. వంద ఎకరాల్లో బాహుబలి రేంజ్‌లో భారీ సెట్టింగ్‌లు వేశారు. ఇందులో 30 ఎకరాల్లో రిసెప్షన్‌ వేదిక నిర్మించారు. దాదాపు 10 లక్షల మంది పొంగులేటి ఆహ్వానం వెళ్లిదంటున్నారు. మూడు లక్షల మంది అతిధులకు భోజన సదుపాయాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా టెంపరరీ వాటర్‌ప్రూప్‌ షెడ్లను నిర్మించారు. దాదాపు 60 వేల కార్లు పార్క్‌ చేసేందుకు వీలుగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

పొంగులేటి కూతూరు రిసెప్షన్ కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భారీగా హజరుకానున్నారు. వీఐపీల కార్ల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలోనే ఇక్కడకు వచ్చే అతిథిలకు రోడ్డు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు..దారి కోసం ఏకంగా కొత్త బ్రిడ్జీనే నిర్మించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రిసెప్షన్‌ వేడుక జరిగే ఎస్‌ఆర్‌ గార్డెన్‌కు వెళ్లే మార్గంలో కాలువపై కోటి రూపాయల వ్యయంతో కొత్త వంతెన నిర్మించారు. ఇక పెళ్లి పత్రిలకతో పాటు పొంగులేటి వారు ప్రతి ఇంటింటికీ గోడ గడియారాలు బహుకరించినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి