Independence day 2022 : సామూహిక జాతీయ గీతాలాపనలో కల్లుగీత కార్మికులు.. వినూత్న రీతిలో జనగణమన..
మంగళవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ప్రజలు ఒకే సమయంలో..
Siddipet: తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపన చేశారు. ఆ సందర్భంగా సిద్దిపేట మున్సిపల్ పరిధిలో కల్లు గీత కార్మికులు కూడా జనగణమన గీతాలాపగావించారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి రెండవ వార్డు నర్సాపూర్‌లో గీతా కార్మికులు వినూత్న పద్ధతిలో తమ దేశభక్తిని చాటుకున్నారు.. ఒకే తాటి చెట్టు 20 మంది పైగా కార్మికులు ఎక్కి జాతీయ జెండాలను ప్రదర్శించారు. అలాగే తాము పని చేసే తాటి వనంలోనే సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భారతీయులంతా ఒక్కటేనని చెప్పడానికి తాము ఈ ప్రదర్శన చేసినట్లు గౌడన్నలు పేర్కొన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తై 76వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ప్రజలు ఒకే సమయంలో ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి