Telangana: కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్.. సీఎంకు వ్యవస్థలపై గౌరవం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవస్థలను అవమానిస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి వర్థంతి కార్యక్రమంలో..

Telangana: కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్.. సీఎంకు వ్యవస్థలపై గౌరవం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు
Kishan Reddy
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 16, 2022 | 12:23 PM

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవస్థలను అవమానిస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి వర్థంతి కార్యక్రమంలో పాల్గొని.. ఆమహానీయునికి నివాళులర్పించారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో వ్యక్తులు శాశ్వతం కాదని.. వ్యవస్థలు శాశ్వతమన్నారు. కేసీఆర్ ఈరోజు ఉంటారు, రేపు పోతారు కాని వ్యవస్థలు ఎప్పటికి ఉంటాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థలను, సంప్రదాయాలను గౌరవించాలని పేర్కొన్నారు.

గవర్నర్ ని, వ్యవస్థని సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచే పార్టీ బీజేపీ అని విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. మునుగోడులో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీకి కేసీఆర్ భయపడుతున్నారని, కొడుకును సీఎం చేయలేకపోతున్న అనే ఆందోళన లో ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి ప్రధాని నరేంద్రమోదీ నచ్చకపోవచ్చని, దేశ ప్రజలకు నరేంద్రమోదీ అంటే ఇష్టమని తెలిపారు. టీఆర్ ఎస్ నాయకులు నిరాశ, నిసృ్పహలె ఉన్నారని.. అందుకే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రపై దాడులు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి