Telangana: ఉప్పొంగిన జాతీయ భావం.. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన..
Independence Day 2022:దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు (ఆగస్టు 16) సామూహిక జాతీయ గీతాలాపనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే
Independence Day 2022: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు (ఆగస్టు 16) సామూహిక జాతీయ గీతాలాపనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని అబిడ్స్ లోని జనరల్ పోస్టాఫీస్ సర్కిల్ వద్ద నిర్వహించిన సామూహిక జనగణమన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతో పాటు ప్రయివేటు సంస్థలు తదితర ప్రదేశాల్లో ఈకార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే రహదారులపై ప్రయాణికులు, వాహనదారులు సహా ప్రజలంతా సరిగ్గా 11.30కి ఎక్కడికక్కడే నిలబడి సామూహిక జనగణమన ఆలపించారు.
నిమిషం పాటు ఆగిన సేవలు..
ఇక ఈ కార్యక్రమం నగరంలోని అన్ని కూడళ్లు, జంక్షన్లలో నిమిషం పాటు రెడ్‌సిగ్నల్‌ను వేశారు. అలాగే ఒక నిమిషం పాటు మెట్రో సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాగా ఈ కార్యక్రమం కోసం తెలంగాణ పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటుచేశారు. స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలు, జనగణమన పాడేందుకు వీలుగా మైకులు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..