AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఊయల ఊగుతుండగా తెగిన గొలుసు..లోతైన లోయలోకి జారి పడిపోయిన అమ్మాయిలు.. వణుకు పుట్టిస్తోన్న వీడియో

Shocking Video: ఎవ్వరూ చేయని సాహసాలు చేయాలని, అందరి దృష్టిని ఆకర్షించాలని చాలామందికి ఉంటుంది. కొందరికి ఎత్తైన పర్వతాలను అధిరోహించాలన్న అభిరుచి ఉంటుంది. మరికొందరు సముద్రపు అలలపై ఈత కొట్టేందుకు ఇష్టపడతారు.

Viral Video: ఊయల ఊగుతుండగా తెగిన గొలుసు..లోతైన లోయలోకి జారి పడిపోయిన అమ్మాయిలు.. వణుకు పుట్టిస్తోన్న వీడియో
Basha Shek
|

Updated on: Aug 15, 2022 | 12:10 PM

Share

Shocking Video: ఎవ్వరూ చేయని సాహసాలు చేయాలని, అందరి దృష్టిని ఆకర్షించాలని చాలామందికి ఉంటుంది. కొందరికి ఎత్తైన పర్వతాలను అధిరోహించాలన్న అభిరుచి ఉంటుంది. మరికొందరు సముద్రపు అలలపై ఈత కొట్టేందుకు ఇష్టపడతారు. ఇంకొందరు సముద్రం అడుగుభాగంలో స్విమ్మింగ్‌ చేయడం, అలాగే ఆకాశం నుంచి దూకడం లాంటి సాహస విన్యాసాలు ప్రదర్శించారు. ఈ సాహసాలన్నీ చాలా ప్రమాదకరమైనవి. చిన్న తప్పు జరిగినా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇక సోషల్‌ మీడియాలో అడ్వెంచర్ వీడియోలు చాలానే చూసి ఉంటారు. ఇవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అదే సమయంలో కొన్ని భయాందోళనను కలిగిసత్ఆయి. ప్రస్తుతం అలాంటి షాకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు అమ్మాయిలు సరదాగా ఊయల ఊగుతూ లోతైన లోయలో పడిపోతారు. ఈ వీడియో చూసిన వారికి కచ్చితంగా గూస్‌బంప్స్‌ రావడం ఖాయం.

ఈ వీడియోలో లోయ సమీపంలో ఒక ఊయల ఏర్పాటు చేయడాన్ని మనం చూడవచ్చు. దానిపై ఇద్దరు అమ్మాయిలు కూర్చొని ఉండగా వెనక నుంచి ఒక వ్యక్తి దానిని ఊపుతుంటాడు. కొద్ది సెకన్ల పాటు సరదాగా ఊయలూగుతారు. అయితే ఉన్నట్లుండి ఊయల గొలుసు అకస్మాత్తుగా తెగిపోతుంది. ఫలితంగా ఊయల విరిగిపోతుంది. ఇదే సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన అమ్మాయిలు ఊయల నుంచి దిగిపోయేందుకు ప్రయత్నిస్తారు. అయితే ప్రమాదవశాత్తూ గుంతలో పడిపోతారు. ఊయల ఊపుతున్న వ్యక్తి వారిని రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అయితే అప్పటికే వారు లోయలోకి జారిపోతారు. అయితే అమ్మాయిల కింకా భూమ్మీద నూకలు ఉన్నాయి. అక్కడున్న సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో వారు గాయాలతో బయపడ్డారు. రష్యాలోని డాగేస్తాన్‌లో ఈ సంఘటన జరిగింది. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షాకింగ్ వీడియోలు అనే యూజర్‌ ఐడీతో ఈ వీడియో షేర్ చేయగా కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ‘ఇది చాలా ప్రమాదకరం, సీటు బెల్టు పెట్టుకుని ఉండాల్సింది’ అని కొందరు సూచిస్తుంటే.. ‘ఇలాంటి స్టంట్లు అంత మంచిది కాదు’ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..