AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ఈ దూకుడేందయ్యా సామీ.. 48 బంతుల్లోనే 108 రన్స్‌..10 ఫోర్లు, 8 సిక్స్‌లతో లీగ్‌లోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ

The Hundred League 2022: ఇంగ్లండ్ వేదికగా జరగుతోన్న ద హండ్రెడ్‌ లీగ్‌ 2022 క్రికెట్‌ టోర్నమెంట్‌ లో పరుగుల వరద పారుతోంది. బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.

Cricket: ఈ దూకుడేందయ్యా సామీ.. 48 బంతుల్లోనే 108 రన్స్‌..10 ఫోర్లు, 8 సిక్స్‌లతో లీగ్‌లోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ
Will Jacks
Basha Shek
|

Updated on: Aug 15, 2022 | 2:05 PM

Share

The Hundred League 2022: ఇంగ్లండ్ వేదికగా జరగుతోన్న ద హండ్రెడ్‌ లీగ్‌ 2022 క్రికెట్‌ టోర్నమెంట్‌ లో పరుగుల వరద పారుతోంది. బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. రెండు రోజుల క్రితం బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌కు చెందిన 20 ఏళ్ల బ్యాటర్‌ విల్‌ స్మీడ్‌ 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. తద్వారా ఈ లీగ్‌లో మొదటి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తాజాగా ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌కు చెందిన 23 ఏళ్ల విల్‌జాక్స్‌ ఏకంగా 47 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. మొత్తం 48 బంతుల్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో 108 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా విల్‌స్మీడ్‌ సెంచరీ సాధించిన సథరన్‌ బ్రేవ్‌పైనే జాక్స్‌ కూడా సెంచరీ బాదడం విశేషం.

ఒంటిచేత్తో.. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత సథరన్‌ బ్రేవ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు ఇన్విన్సిబుల్స్‌ సామ్‌ బిల్లింగ్స్‌. అతని నిర్ణయం కరెక్టేనని బౌలర్లు నిరూపించారు. నిర్ణీత 100 బంతుల్లో ప్రత్యర్థిని 137 పరుగులకే కట్టడి చేశారు. మార్కస్‌ స్టోయినిస్‌ (27 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. టీమ్‌ఇండియాను బెంబేలెత్తించిన రీస్‌ టాప్లే 20 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి సథరన్‌ బ్రేవ్‌కు చుక్కులు చూపించాడు. కాగా తక్కువ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్‌కు జాక్స్‌ అదిరే ఆరంభం ఇచ్చాడు. 225 స్ట్రైక్‌ రేట్‌తో మెరుపు సెంచరీ సాధించాడు. ఫలితంగా 82 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది ఇన్విన్సిబుల్స్‌.

మరికొన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..