Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఐదుగురు అలనాటిమేటి నటులు.. నేటి తరానికి నట చలనచిత్ర నిత్య అధ్యయన పాఠాలు.. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం

మన పక్కింటి వ్యక్తులను చూస్తున్న ఫీలింగ్ ఉండే.. అటువంటి నటీమణులు ఒకేసారి కలిస్తే.. ఉండే సందడి వేరు.. నేటి తరానికి తెలియని.. అలనాటి అందాల ఫోటో ప్రత్యేకంగా ఈరోజు తెలుసుకుందాం. ఈ నట పంచాయతన నటీమణుల నటన చలనచిత్ర నిత్య అధ్యయన పాఠాలు అని చెప్పవచ్చు..

Viral Photo: ఈ ఐదుగురు అలనాటిమేటి నటులు.. నేటి తరానికి నట చలనచిత్ర నిత్య అధ్యయన పాఠాలు.. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం
Old Actors Viral Photo
Follow us
Surya Kala

|

Updated on: Aug 15, 2022 | 3:45 PM

Actors Viral Photo: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో ఒక పేజీని లిఖించుకున్న మహిళ మహారాణులు ఎందరో ఉన్నారు. సినిమా పరిశ్రమను ఏలిన నటిమణులు, నట మహారాణుల గురించి నేటి తరానికి బహుఅరుదుగా తెలుసు. హీరోయిన్లు మాత్రమే కాదు.. తాము నటించిన ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి.. ఆ పాత్రకే వన్నె తెచ్చేవారు.. గయ్యాళిగా, త్యాగమూర్తిగా, అల్లరిపిల్లగా, భాద్యత తెలిసిన వ్యక్తిగా ఇలా ఏ పాత్రలో నటించినా.. ఆ సినిమాలను చూస్తుంటే.. మన పక్కింటి వ్యక్తులను చూస్తున్న ఫీలింగ్ ఉండే.. అటువంటి నటీమణులు ఒకేసారి కలిస్తే.. ఉండే సందడి వేరు.. నేటి తరానికి తెలియని.. అలనాటి అందాల ఫోటో ప్రత్యేకంగా ఈరోజు తెలుసుకుందాం. ఈ నట పంచాయతన నటీమణుల నటన చలనచిత్ర నిత్య అధ్యయన పాఠాలు అని చెప్పవచ్చు..

ఫొటోలో మధ్యలో ఉన్న నటీమణి సినీ కళాభినేత్రి మహానటి సావిత్రి. ఆమె సినీ అభినయానికి చిరునామా. హీరోయిన్ పాత్రలకు ఆమె నటన ఒక రిసెర్చ్ సబ్జెక్ట్.. దక్షిణాది వెండితెర ఏలిన నట సామ్రాజ్ఞి మన సావిత్రి.

సావిత్రి కి ఎడమ వైపున నటి ఆంధ్రుల సత్యభామ జామున. తన విలక్షణమైన సహజ సౌందర్యం, లలిత లావణ్యంతో గారాన్ని ఒయ్యారంగా అభినయించే మేటి కథానాయిక జామున. దక్షిణాదిలో పాటు, హిందీలో  తన నటనతో ఫేమ్ తెచ్చుకున్న అలనాటి మేటి..  సాటిలేని హీరోయిన్ జమున

ఇవి కూడా చదవండి

ఉమ్మడి కుటుంబంలో పెద్దకు ఉండే గౌరవం అభిమానం గురించి చెప్పాల్సిన పనిలేదు. శాంతం మూర్తీభవించిన మానవత్వం  పెద్దరికానికి, గౌరవానికి తలమానికంగా నిలిచే శాంతకుమారి.. సావిత్రికి కుడివైపున ఉన్నారు. తెలుగింటి కుటుంబ పెద్దమ్మగా తెలుగు చలన పరిశ్రమలో అప్పట్లో కీర్తింపబడ్డారు. శాతానికి సాక్షి రూపం మన తెలుగుకళామ్మ తల్లి అమ్మ శాంతకుమారి

గయ్యాళి తనంతో కూడా అభిమానులను సొంతం చేసుకోవచ్చు అని సహజ నటనకే కొత్త భాష్యం చెప్పిన సూర్యకాంతం.. ఫొటోలో వెనుక నిల్చున్నారు. ఎడమ చేతి వాటంతో అభినయించి.. అలనాటి నటులను తన నటనతో చెమటలు పట్టించిన గయ్యాళి అత్తమ్మ సూర్యకాంతమ్మ.. నిజ జీవితంలో మనసున్న మంచి మనిషి.. పదిమంది ఆకలిని తీర్చే బంగారు తల్లి అంటారు.

శాంతకుమారి పక్కన ఉన్న నటీమణి అలనాటి కుర్రకారు మదిలో గుబులు రేపిన గ్లామర్ హీరోయిన్ చంద్రకళ. తన అందచందాలతో పాటు.. ఎక్కడా వల్గర్ లేని గ్లామర్ తో యూత్ తో కలల రాణిగా గిలిగింతలు పెట్టిన చంద్రకళ..

ఈ ఐదుగురు నట రత్నాలు అనుకోకుండా ఒక సందర్భంలో కలిసినప్పుడు తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరి గురించి నేటి తరానికి.. సినీ అభిమానుల  ఈ నటీమణుల గురించి తెలియజేయడంకోసం.. మేము చేసిన చిన్న ప్రయత్నం..

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..