Anupama Parameshwaran: అందుకే ముద్దు సీన్స్ చేయాల్సి వచ్చింది.. ‘రౌడీ బాయ్స్’ సినిమాపై అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ సినిమాలోని నా పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అది నాకు మంచి ఎనర్జీ ని ఇచ్చినట్లు అనిపించింది..ఈ సినిమా చూసిన వారందరూ చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.

Anupama Parameshwaran: అందుకే ముద్దు సీన్స్ చేయాల్సి వచ్చింది.. 'రౌడీ బాయ్స్' సినిమాపై అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు..
Anupama
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 15, 2022 | 3:36 PM

అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran). కోవిడ్ తరువాత స్పీడ్ పెంచిన ఈ భామ రౌడీ బాయ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. దక్షిణాది పరిశ్రమలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ చిన్నది తాజాగా కార్తికేయ 2 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్త్.. డైరెక్టర్ చందు మోండేటి కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో హిట్ అయిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన “కార్తికేయ‌ 2″ చిత్రాన్ని టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో ముచ్చటించిన అనుపమ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అనుపమ మాట్లాడుతూ.. ” ఈ సినిమాలోని నా పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అది నాకు మంచి ఎనర్జీ ని ఇచ్చినట్లు అనిపించింది..ఈ సినిమా చూసిన వారందరూ చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. చందు గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యి ఈ సినిమా చేద్దాం అనుకున్నాను.ప్రతి కథకు కంటెంట్ అనేది చాలా ముఖ్యం చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు మనుషుల్లో ఉన్న మంచితనాన్ని నేను దైవంగా బావిస్తాను.ఈ సినిమాలో లో కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది.అందుకే ఈ సినిమా కథ నచ్చడంతో నాకొచ్చిన కొన్ని ప్రాజెక్ట్స్ ను కూడా వదులుకున్నాను. లొకేషన్స్ మారుతూ షూటింగ్ చేయడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాగే మంచు గడ్డ కట్టే ప్రదేశంలో షూటింగ్ చేయడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

రౌడీ బాయ్స్ లో ఎక్కువ గ్లామర్ గా వుండాలని చేసిన పాత్ర కాదు .స్విచ్వేషన్ డిమాండ్ మేరకు ముద్దు సీన్స్ లలో నటించాను. 75 ఇయర్స్ అయినా కూడా విమెన్ ఏంపవర్మెంట్ అనేది ఈక్వల్ గా ఉంది అనుకుంటున్నాను.అయితే పదే పదే మహిళలు వెనుకబడి ఉన్నారు అని చెప్పడం వలన ఇంకా మహిళలు వెనుకబడి ఉన్నారనే బావన గురి చేస్తుంది. ఇప్పుడు మహిళలు మగవారితో సమానంగా ముందుకు వెళుతున్నారు. ప్రస్తుతం రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు చిత్రాలు చర్చల్లో ఉన్నాయి.వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. అలాగే 18 పేజెస్ సినిమా వారం రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది.” అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.