Indhu Anandh: నేను బతికి ఉండగానే నా కూతురు మరణించాలని చెప్పిన నటి ఇందు.. రీజన్ తెలిస్తే తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అనిపించకమానదు..

ఈ వయసులో తాను కష్టపడడానికి కారణం.. తన కూతురిని ఎంతో రాయల్ గా చూసుకోవడం కోసమే అంటూ చెప్పి తల్లి ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని చెప్పారు. 

Indhu Anandh: నేను బతికి ఉండగానే నా కూతురు మరణించాలని చెప్పిన నటి ఇందు.. రీజన్ తెలిస్తే తల్లి ప్రేమ అంటే ఇదేనేమో అనిపించకమానదు..
Indu Anand
Follow us
Surya Kala

|

Updated on: Aug 12, 2022 | 9:06 AM

Actor Indhu Anandh: సృష్టిలో అమూల్యమైనది తల్లిప్రేమ.. కొవ్వొత్తిలా తాను కరుగుతూ తన పిల్లల జీవితంలో వెలుగులు నింపేది అమ్మ. అటువంటి అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా.. ఎన్ని సార్లు చెప్పినా తక్కువే.. తాజాగా అటువంటి అమ్మ ప్రేమకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు క్యారెక్టర్ ఆర్టిస్టు ఇందు ఆనంద్.. బద్రి, గమనం, బుడుగు వంటి అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టుగా నటించారు. అంతేకాదు.. చక్రవాకం, మొగలిరేకులు, కళ్యాణ వైభోగమే వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన పాత్రకు అనుగుణంగా అలవోకగా నటిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకునే ఇందు ఆనంద్ జీవితంలో అత్యంత విషాదం నిండి ఉందని తెలుసా..!

కూతురిపై ఇందు ఆనంద్ ప్రేమ: 

కేరళకు చెందిన ఇందు ఆనంద్.. తండ్రి ఆర్మీలో పనిచేసేవారు. దీంతో దేశంలో అన్ని ప్రదేశాలను చిన్నతనంలోనే తిరగాల్సి వచ్చింది. దాదాపు 10 భాషలు మాట్లాడగలరు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇందు ఆనంద్ భర్త ప్రోత్సాహంతో నటిగా మారి.. వెండి తెరపై అడుగు పెట్టారు. అయితే ఆమె ఈ వయసులో కూడా కష్టపడుతూ.. నటించాల్సి రావడానికి కారణం తన కూతురు అని చెప్పారు ఓ ఇంటర్వ్యూలో.. తనకు  మూడు పెద్ద సర్జరీలు జరిగాయని.. అయితే ఈ వయసులో తాను కష్టపడడానికి కారణం.. తన కూతురిని ఎంతో రాయల్ గా చూసుకోవడం కోసమే అంటూ చెప్పి తల్లి ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

తనకు కూతురు జన్మతః మానసిక ఎదుగుదల లేదని.. అంతేకాదు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని ఇందు ఆనంద్ చెప్పారు. అయితే తన కూతురికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని అప్పటి నుంచి కష్టపడుతున్నానని చెప్పారు. తన భర్త మరణించిన అనంతరం.. తల్లి,తండ్రి అన్నీ అయి తానై తన కూతురిని పెంచాననని.. ఇప్పటికీ తన కూతురిని పెంచడం భారంగా ఒక్కసారి కూడా భావించలేదని చెప్పారు. అంతేకాదు.. తన కూతురు తాను జీవించి ఉండగానే.. తన చేతుల్లోనే మరణించాలని కోరుకుంటున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుశా ఇలా ఏ తల్లి కోరుకోదేమో.. కానీ.. నేను కోరుకుంటున్నా.. ఎందుకంటే.. నేను నా కూతురుకంటే ముందుగా మరణిస్తే.. తనని చూసేవారు ఎవరూ ఉండరు.. ఎవరికీ తన కూతురు భారం కాకూడదు అంటూ తల్లిప్రేమ అంటే ఇలా ఉంటుంది అని పించేలా చేశారు ఇందు ఆనంద్.  ఈ వయసులో కూడా తాను ఇంత కష్టపడుతున్నానంటే..అంతా తన భర్త కోసమే అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..