Karthika Deepam: కార్తీకదీపం ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వంటలక్క బతికింది.. రీఎంట్రీకి సిద్ధం.. డాక్టర్ బాబు కూడా? ఇదిగో వీడియో..
బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క కోసమే జనాలు ఈ సిరీయల్‌ను తెగ చూసేవారు. అయితే, ఓ రోడ్డు ప్రమాదంలో వీరు చనిపోయినట్లు చూపించడంతో.. రేటింగ్స్‌తోపాటు జనాలు కూడా ఈ సిరీయల్‌కు దూరమయ్యారు.
Vantalakka – Docter Babu: బుల్లితెరపై ‘కార్తీకదీపం’ సీరియల్ ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క కోసమే జనాలు ఈ సిరీయల్‌ను తెగ చూసేవారు. అయితే, ఓ రోడ్డు ప్రమాదంలో వీరు చనిపోయినట్లు చూపించడంతో.. రేటింగ్స్‌తోపాటు జనాలు కూడా ఈ సిరీయల్‌కు దూరమయ్యారు. కాగా, వంటలక్క, డాక్టర్ బాబుల పిల్లలు పెద్దవారు అయ్యారు. అయితే, ఈ సిరీయల్ మాత్రం పెద్దగా జనాలను ఆకట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలో దారుణమైన రేటింగ్స్ రావడంతో తలలు పట్టుకున్న ప్రొడక్షన్ టీం.. ఎట్టకేలకు వంటలక్క, డాక్టర్ బాబుల ఎంట్రీకి రంగం సిద్ధం చేశారంట. ఈ మేరకు వంటలక్క కోమాలో ఉన్నట్లు ఓ ప్రోమో విడుదల చేయడంతో.. ఫ్యాన్స్ అంతా తెగ సంబరపడిపోతున్నారు. కోమాలో నుంచి వంటలక్క కోలుకోవడం ఈ ప్రోమోలో చూపించారు. అలాగే డాక్టర్ బాబు అంటూ కలవరించడం కూడా చూడొచ్చు. మొత్తానికి దారుణ రేటింగ్స్‌తో నెట్టుకొస్తున్న కార్తీకదీపం సిరీయల్‌కు డైరెక్టర్ సరికొత్తగా ప్రాణం పోసేందుకు ప్లాన్ చేశారు.
View this post on Instagram
ఈ ప్రోమోతో జనాల్లో ఆసక్తి రేపిన స్టార్ మా యాజమాన్యం.. మరలా రేటింగ్స్‌లో అగ్రస్థానం కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ క్రమంలో వీరిద్దరి ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం.. మరి మోనిత కూడా రీఎంట్రీ ఇవ్వనుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో ఇంతవరకు అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జనాలు మాత్రం మోనిత కూడా తిరిగి వస్తుందని భావిస్తున్నారు. సో.. అర్థమైంది కదా.. మొత్తానికి కార్తీకదీపం ఇకపై మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.