AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Setu Film: సినిమా రిలీజ్ కు ముందే వివాదంలో రామసేతు మూవీ.. హీరో అక్షయ్ పై కేసు వేయడానికి రెడీ అవుతున్న సుబ్రమణ్యస్వామి

నటుడు అక్షయ్ కుమార్‌పై బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి కేసు వేస్తారని దయచేసి అతనికి చెప్పండని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సినిమాలో రామసేతు అంశాన్ని తప్పుగా చూపించారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.

Ram Setu Film: సినిమా రిలీజ్ కు ముందే వివాదంలో రామసేతు మూవీ.. హీరో అక్షయ్ పై కేసు వేయడానికి రెడీ అవుతున్న సుబ్రమణ్యస్వామి
Rama Setu Moive
Surya Kala
|

Updated on: Jul 29, 2022 | 11:47 AM

Share

Ram Setu Film: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ‘రామసేతు’ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా కథ పై న్యాయ పోరాటాన్ని చేయడానికి కొందరు రెడీ అయ్యారు. అంతేకాదు రామ సేతు మూవీ విషయంపై సినీ హీరో అక్షయ్ కుమార్‌పై కేసు నమోదు చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.  రామ సేతు అంశాన్ని సినిమాలో తప్పుగా చూపించారని బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. పరిహారం చెల్లించాలంటూ కేసు పెట్టనున్నని చెప్పారు. సుబ్రమణ్యస్వామి స్వయంగా ఈ సినిమాపై దావా వేయనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

అక్షయ్ కుమార్‌పై కేసు నమోదు:  నటుడు అక్షయ్ కుమార్‌పై బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి కేసు వేస్తారని దయచేసి అతనికి చెప్పండని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సినిమాలో రామసేతు అంశాన్ని తప్పుగా చూపించారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. వాస్తవాలను తారుమారు చేశారని ఆరోపించారు. సుబ్రమణ్యస్వామి తన ట్వీట్‌లో ఇలా వ్రాశాడు..  ‘పరిహారం కేసును నా సహోద్యోగి న్యాయవాది సత్య సబర్వాల్ ఖరారు చేశారు. సినిమాలో రామసేతు అంశాన్ని తప్పుగా చిత్రీకరించడం వల్ల జరిగిన నష్టానికి నటుడు అక్షయ్ కుమార్, కర్మ మీడియాపై నేను దావా వేస్తున్నానని నిర్మాత పేర్కొన్నారు.

కొన్ని నెలల క్రితం పోస్టర్ వైరల్‌: ఏప్రిల్ నెలలోనే రామసేతు చిత్రం పోస్టర్ వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పోస్టర్‌లో అక్షయ్ కుమార్‌తో జాక్వెలిన్, సత్యదేవ్ కనిపిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌లో ఈ ముగ్గురు నటీనటులు ఓ చారిత్రక ప్రదేశంలో కనిపించడం గమనించవచ్చు. ఈ ముగ్గురూ ఒక గుహ లోపల కనిపిస్తారు, దీని గోడపై వింత గుర్తు ఉంది.

అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరం 2022 దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారు. అయితే విడుదలకు ముందే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. అయితే అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న రక్షాబంధన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 11న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..