- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda and Ananya Panday arrived in Mumbai Bandra for the promotion of film Liger were seen dancing among the people
Liger Movie: ముంబయి వీధుల్లో లైగర్ జోడి.. పిల్లలతో సరదాగా స్టెప్పులేసిన విజయ్, అనన్య
Liger Movie: విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. ఆగస్టు 25న విడుదల ఈ సినిమా కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజిబిజీగా గడుపుతోంది.
Updated on: Jul 28, 2022 | 10:05 PM

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. ఆగస్టు 25న విడుదల ఈ సినిమా కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజిబిజీగా గడుపుతోంది. తాజాగా విజయ్, అనన్యలిద్దరూ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సందడి చేశారు. స్థానిక పిల్లలతో కలిసి డ్యాన్స్‌లు చేస్తూ ఆకట్టుకున్నారు.

'లైగర్' ప్రమోషన్ విజయ్, అనన్యతో పాటు ఒక కొరియోగ్రాఫర్ కూడా కనిపించాడు. ఆయన హీరో, హీరోయిన్లకు డ్యాన్స్ నేర్పించడం, ఆతర్వాత వారు పిల్లలతో కలిసి కాలు కదపడం స్థానికులను కట్టిపడేసింది.

ఇటీవల లైగర్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా, విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో పాటు, చిత్రనిర్మాత కరణ్ జోహార్, చిత్ర దర్శకులు పూరీ జగన్నాథ్, రణవీర్ సింగ్ కూడా కనిపించారు. ఈ సమయంలో, విజయ్ దేవరకొండ సాధారణ చెప్పులు ధరించి ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైక్ టైసన్‌కు మొట్టమొదటి ఇండియన్ సినిమా ఇదే. అదే సమయంలో విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు.

'లైగర్' చిత్రం ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా చాలా తక్కువ సమయం మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.




