- Telugu News Photo Gallery Cinema photos Rakul Preet Singh wants to act in movies like Dilwale Dulhania Le Jayenge
Rakul Preet Singh: అలాంటి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నా.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రకుల్.. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
Updated on: Jul 28, 2022 | 10:11 PM

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఒకరు.

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రకుల్.. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది

తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. హిందీలో మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

చివరిసారిగా అజయ్ దేవగన్ తెరకెక్కించిన రన్ వే 34 చిత్రంలో కనిపించింది. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టింది రకుల్

ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాను. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించాను. కానీ ఒక బయోపిక్ చేయాలని ఉంది. గొప్పగా చెప్పుకునేవారి జీవిత కథలో నటించాలని ఉంది.

అలాగే అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీస్ చేసేందుకు ఇష్టపడతాను. దిల్ వాలే దుల్హానియా లేజాయింగే వంటి అందమైన ప్రేమకథలో నటించాలనుకుంటున్నాను. ఎక్కువగా లవ్ స్టోరీస్, బయోపిక్స్ చేసేందుకు మాత్రమే ఇష్టపడతాను. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది రకుల్.




