AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: తన సంపాదన లో 30 శాతం వివిధ సేవలకు ఖర్చు చేసే ప్రిన్స్ పుట్టిన రోజు నేడు.. కోలీవుడ్ లో ఆ స్టార్ హీరోలు క్లాస్ మేట్స్ అన్న సంగతి తెలుసా..!

చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో మహేష్ బాబు ఒకరు.. అయితే ఆయన తన సంపాదనలో 30 శాతం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తారు. నేడు ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను గురించి తెలుసుకుందాం.. 

Mahesh Babu: తన సంపాదన లో 30 శాతం వివిధ సేవలకు ఖర్చు చేసే ప్రిన్స్ పుట్టిన రోజు నేడు.. కోలీవుడ్ లో ఆ స్టార్ హీరోలు క్లాస్ మేట్స్ అన్న సంగతి తెలుసా..!
Mahesh Babu Birthday
Surya Kala
|

Updated on: Aug 09, 2022 | 8:17 AM

Share

Happy Birthday Mahesh Babu: టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా అడుగు పెట్టాడు మహేష్ బాబు. అన్నయ్య రమేష్ బాబు హీరోగా నటించిన సినిమా నీడలో మహేష్ బాబు నటించి బాలనటుడిగా వెండి తెరపై అడుగు పెట్టాడు. అప్పుడు మహేష్ బాబుకి కేవలం నాలుగేళ్లు మాత్రమే. తండ్రి కృష్ణ పోరాటం సినిమాలో కృష్ణ కు తమ్ముడిగా నటించి ఆకట్టుకున్నాడు.  రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ.. అంచెలంచెలుగా ఒకొక్క సినిమాతో కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నాడు మహేష్ బాబు. అంతేకాదు అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో మహేష్ బాబు కూడా ఒకరు.. అయితే ఆయన తన సంపాదనలో 30 శాతం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తారు. నేడు ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈరోజు మహేష్ బాబు జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను గురించి తెలుసుకుందాం..

ఘట్టమనేని మహేశ్ ‌బాబు సూపర్ స్టార్ కృష్ణ,  ఇందిర దంపతులకు 1975 ఆగస్టు 9న చెన్నైలో జన్మించారు. చెన్నై లో పుట్టి పెరిగిన మహేష్ బాబు  తమిళ స్కూల్ లో చదువుకున్నారు. కోలీవుడ్ స్టార్స్ కార్తీ, సూపర్ స్టార్ దళపతి విజయ్ లు మహేష్ బాబు క్లాస్ మేట్స్.. అయితే మహేష్ బాబు తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడినా తెలుగు చదవడం రాదు. చెన్నైలో విద్యాభ్యాసం కారణంగా తెలుగు చదవడం రాదు. తాను తెలుగు చదవలేనని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబుకి మొట్టమొదటి హిట్ వచ్చిన సినిమా మురారి. వంశీ సినిమాలో తనతో నటించిన బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిదోర్కర్ ను ప్రేమించాడు. 4 ఏళ్ళు డేటింగ్ అనంతరం ముంబై లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత తండ్రి కృష్ణను.. అక్క మంజుల ఒప్పించిందని అంటారు.

ఒక్కడు సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఇక పోకిరి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైం సినీ ఇండస్ట్రీ రికార్డ్ ను సృష్టించాడు. చిత్ర పరిశ్రమలో అత్యంత సంపన్న నటుల్లో మహేష్ బాబు ఒకరు. నటుడు , నిర్మాత, పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా  భారీగా సంపాదిస్తున్న మహేష్ బాబు.. తన సంపాదంలో లో 30 శాతం వివిధ సేవలకు ఖర్చు చేస్తారు. అంతేకాదు ఇప్పటికే ఎంతో మంది చిన్నారుల అనారోగ్యానికి చికిత్స అందిస్తూ.. ప్రాణాలు పోసిన మానవత్వం ఉన్న మహానీడుగా కీర్తించబడుతున్నాడు మహేష్ బాబు నమ్రత దంపతులు. ఇక మహేష్ బాబు ఏపీ లోని స్వగ్రామమైన బుర్రిపాలెం సహా తెలంగాణ లోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నాడు. అయితే తనకు తన తండ్రి నటించిన హిట్ చిత్రాలను రీమేక్ చేసే ఉద్దేశ్యం లేదని పలు సందర్భాల్లో స్పష్టం చేశాడు. ఇక ఓ వైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి సమయం కేటాయిస్తాడు. మహేష్, నమ్రత దంపతులకు గౌతమ్, సితార లు సంతానం. ఆయన పిల్లలకు అద్భుతమైన తండ్రి.. గొప్ప భర్త.. ప్రస్తుతం త్రివిక్రమ్. రాజమౌళి దర్శకత్వంలో సినిమాలను చేయడానికి రెడీ అవుతున్నాడు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుండి మహేష్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు.. సినిమా విడుదల రోజునే లేడీ అభిమానులు క్యూ లు కడతారు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది టీవీ 9

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.