Bigg Boss Season 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్టైమెంట్‌కు అడ్డా ఫిక్స్.. అదిరిపోయిన ప్రోమో

తెలుగు ప్రేక్షకులను అలరించిన రియాలిటీ షో ఏది అంటే టక్కున చెప్పే పేరు బిగ్ బాస్(Bigg Boss).. వివిధ భాషల్లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్.. తెలుగులోనూ టాప్ రేటింగ్ తో సూపర్ హిట్ అయ్యింది.

Bigg Boss Season 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్టైమెంట్‌కు అడ్డా ఫిక్స్.. అదిరిపోయిన ప్రోమో
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 09, 2022 | 11:09 AM

తెలుగు ప్రేక్షకులను అలరించిన రియాలిటీ షో ఏది అంటే టక్కున చెప్పే పేరు బిగ్ బాస్(Bigg Boss).. వివిధ భాషల్లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్.. తెలుగులోనూ టాప్ రేటింగ్ తో సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పటివరకు 5 సీజన్స్ లో విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరో సీజన్ కు సిద్ధం అయ్యింది. గత మూడు సీజన్స్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జుననే ఈసారి కూడా హోస్ట్ చేయనున్నారు. ఇటీవలే అఫీషియల్ గా బిగ్ బాస్ సీజన్ 6 ను అనౌన్స్ చేసిన నిర్వాహకులు తాజాగా ప్రోమోను రిలీజ్ చేశారు. అన్ని సీజన్స్ పోమోల మారిరిగానే ఈ ప్రోమో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరోసారి నాగ్ తన హోస్టింగ్ తో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారని ఈ ప్రోమో చూస్తే అర్ధమవుతోంది.

ఇక ఈ ప్రోమో చాలా వెరైటీగా డిజన్ చేశారు. ఈ వీడియోలో ఓ పెళ్లివేడుకలో కూతురిని అత్తారింటికి పంపే సన్నివేశంలో అందరు ఒక్కసారిగా అక్కడి నుంచి మాయం అవుతారు. అప్పుడు నాగ్ ఎంట్రీ ఇచ్చి.. అప్పగింతలవారకు కూడా ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ సిక్స్.. ఎంటర్టైమెంట్ కు అడ్డా ఫిక్స్ అంటూ నాగ్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. మరి ఈ సీజన్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కూడా.. \

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి