Ravi Teja: తగ్గేదే లేదంటున్న రవితేజ.. మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ మహరాజా

మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈసినిమా శరత్ మండవ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Ravi Teja: తగ్గేదే  లేదంటున్న రవితేజ.. మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ మహరాజా
Raviteja
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 08, 2022 | 9:11 PM

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) రీసెంట్ గా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈసినిమా శరత్ మండవ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మాస్ రాజా అభిమానులను నిరాశపరిచింది. ఇక రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్లీ క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు రవితేజ.. ఆ తర్వాత చేస్తూ వస్తోన్న సినిమాలు మళ్లీ ఫ్లాప్ల బాట పడుతున్నాయి. అయితే ఫ్లాప్ లు పలకరించిన రవితేజ రోజు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే మూడు సినిమాలను లైనప్ చేసిన రవితేజ.. ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం మాస్ రాజా టైగర్ నాగేశ్వరావు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే ఇటీవల రావణాసుర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. అలాగే మెగాస్టార్ తో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో కీలకపాత్రలో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమానా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే శ్రీవాస్ కు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. శ్రీవాస్ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తికాకుండానే రవితేజకి కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. అంతే కాదు ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని కూడా అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను మొదలు పెట్టనున్నారని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే