Aamir Khan: మీడియాను క్షమాపణలు కోరిన అమీర్ ఖాన్.. కారణం ఇదే

సినిమా ప్రమోషన్స్ ఈ మధ్య జోరుగా సాగుతున్నాయి. షూటింగ్ అవ్వడం ఆలస్యం ప్రమోషన్స్ తో మోతమోగిస్తున్నారు చిత్రయూనిట్. ఇది ఒక్క టాలీవుడ్ లోనే కాదు అన్ని ఇండస్ట్రీలోనూ ఇదే తంతు.. పాన్ ఇండియా సినిమాలదైతే నెక్స్ట్ లెవల్ ..

Aamir Khan: మీడియాను క్షమాపణలు కోరిన అమీర్ ఖాన్.. కారణం ఇదే
Aamir Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 08, 2022 | 8:41 PM

సినిమా ప్రమోషన్స్ ఈ మధ్య జోరుగా సాగుతున్నాయి. షూటింగ్ అవ్వడం ఆలస్యం ప్రమోషన్స్ తో మోతమోగిస్తున్నారు చిత్రయూనిట్. ఇది ఒక్క టాలీవుడ్ లోనే కాదు అన్ని ఇండస్ట్రీలోనూ ఇదే తంతు.. పాన్ ఇండియా సినిమాలదైతే నెక్స్ట్ లెవల్ .. దేశం మొత్తం తిరుగుతూ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు.. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు లైగర్ సినిమా వరకు కంటిన్యూ అవుతూ వస్తోంది. ఇదిలా ఉంటే ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేస్తే సరిపోదు.. టైంకి అటెండ్ అవ్వాలి కూడా ఇలా మీడియాను వెయిట్ చేయించిన స్టార్స్ మీడియా సోదరులకు క్షమాపణలు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వారి కారణాలు వాళ్లకు ఉండొచ్చు కానీ ఎదురుచూడటం మీడియా పనికాదు కాబట్టి స్టార్స్ కూడా క్షమాపణలు చెప్తూ ఉంటారు. కన్నడ పరిశ్రమలో అల్లు అర్జున్ కు ఇదే పరిస్థితి ఎదురైంది.. అక్కడ బన్నీ ఆలస్యంగా  వచ్చారంటూ అక్కడి మీడియా అనడంతో బన్నీ ఎంతో వినమ్రతతో క్షమాపణలు చెప్పారు.. అదే పరిస్థితి మన దగ్గర కన్నడ స్టార్ యష్ కు కూడా ఎదురైంది. దాంతో అతడు కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు అమీర్ ఖాన్ వంతు.. తాజాగా లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో అమీర్ చాలా బిజీగా ఉన్నాడు. సినిమాను ఎలాగైనా హిట్ చేయించాలని పట్టుబట్టి ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే చెన్నై లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ కు అమీర్ ఆలస్యంగా వచ్చారు. దాంతో మీడియాకు అమీర్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. ఇక అమీర్ ఖాన్ హీరోగా వస్తోన్న ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించాడు.  ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే