Rashmika Mandanna : ”నా కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా”.. రష్మిక ఆసక్తికర కామెంట్స్..

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ సీతారామం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తో దుల్కర్ తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి.

Rashmika Mandanna : ''నా కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా''.. రష్మిక ఆసక్తికర కామెంట్స్..
Rashmika Mandanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 08, 2022 | 8:19 PM

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ సీతారామం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తో దుల్కర్ తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో  రష్మిక మందన(Rashmika Mandanna )కీలక పాత్రలో నటించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించారు.  ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో అఫ్రిన్ గా కనిపించిన రష్మిక పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా సీతారామం క్లాసిక్ విజయంపై విలేఖరుల సమావేశంలో మాట్లాడారు రష్మిక.

రష్మిక మాట్లాడుతూ.. ‘సీతారామం’ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘సీతారామం’ కోసం టీమ్ అంతా దాదాపు రెండేళ్ళ పాటు చాలా హార్డ్ వర్క్ చేసింది. కష్టానికి తగ్గ ఫలితం ప్రేక్షకులు క్లాసిక్ బ్లాక్ బస్టర్ రూపంలో ఇచ్చారు. దర్శకుడు హను గారు అఫ్రిన్ పాత్రని గురించి చెప్పినపుడు ఆ పాత్రలో గ్రేట్ ఆర్క్ వుందని అన్నారు. నేను కూడా దాన్ని బలంగా నమ్మాను. మా నమ్మకం నిజమైయింది అన్నారు. అఫ్రిన్ లాంటి వైలెంట్ పాత్ర ఇంతవరకూ చేయలేదు. ఇది ఛాలెంజ్ గా అనిపించింది. చాలా కొత్తగా అనిపించింది అన్నారు రష్మిక. సీతారామం నాకు ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ. నేను ఇప్పటి వరకూ హీరోయిన్ గానే చేశాను. అయితే ఒక నటిగా విభిన్నమైన పాత్రలు చేయాలని వుంటుంది. సీతారామంలో నా పాత్ర చాలా యునిక్ గా అనిపించింది. ఒక గొప్ప కథని చెప్పే పాత్ర కావడం నాకు చాలా నచ్చింది. రాబోతున్న సినిమాల్లో కూడా కొన్ని డిఫరెంట్ రోల్స్ చేస్తున్నా అన్నారు. ప్రయోగాత్మక చిత్రాలు చేయడం కూడా చాలా ముఖ్యం. కంఫర్ట్ జోన్ లో వుండటం బాగానే వుంటుంది. అయితే ఒక నటిగా అన్ని డిఫరెంట్ పాత్రలు చేయాలని వుంది. ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ దాటి కొన్ని సినిమాలు చేస్తున్నా అని చెప్పుకొచ్చింది రష్మిక.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే