Bigg Boss 6: బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక ఆట మొదలు ఎప్పటినుంచంటే..

ఈసారి ఈ షోలోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో 10 మంది అమ్మాయిలు.. 9 మంది అబ్బాయిలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss 6: బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక ఆట మొదలు ఎప్పటినుంచంటే..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 09, 2022 | 8:06 PM

బుల్లితెరపై బిగ్‏బాస్ సందడి మొదలు కాబోతుంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‏బాస్ సీజన్ 6 త్వరలోనే రాబోతుందంటూ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పటికే నెట్టింట బిగ్‏బాస్ సందడి షూరు అయ్యింది. సెప్టెంబర్ 4 నుంచి బిగ్‏బాస్ 6వ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈసారి ఈ షోలోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో 10 మంది అమ్మాయిలు.. 9 మంది అబ్బాయిలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫేమస్ సెలబ్రెటీలతోపాటు.. యూట్యూబర్స్, బుల్లితెర నటీనటులు ఉండనున్నారు. అయితే ఇప్పటికే బిగ్‏బాస్ రియాల్టీ షోలోకి వెళ్లే అంటూ కంటెస్టెంట్స్ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఎవరెవరో తెలుసుకుందామా.

సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన గీతు ఈసారి బిగ్‏బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనుంది. తన మాటలతో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకున్న గీతూ.. ప్రస్తుతం జబర్థస్త్ కామెడీ షోలో పాల్గోంటుంది. అలాగే.. యూట్యూబర్ ఆదిరెడ్డి కూడా బిగ్‏బాస్ ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. బిగ్‏బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యాడు ఆదిరెడ్డి.

అలాగే ఫేమస్ యాంకర్ ఉదయభాను సైతం ఈసారి బిగ్‏బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనుందట. బుల్లితెర ప్రేక్షకులకు ఉదయభాను పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్‍గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకుంది. అలాగే జబర్ధస్థ్ కమెడియన్ చలాకీ చంటి కూడా బిగ్‏బాస్ ఇంట్లోకి కంటెస్టెంట్ గా రానున్నారట. ఇక జబర్దస్త్ అప్పారావు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక బిగ్‏బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఫైనల్ వరకు నిలిచింది సిరి. ఇక అప్పటినుంచి బిగ్‏బాస్ సీజన్ 6లో ఆమె ప్రియుడు శ్రీహాన్ అడుగుపెట్టనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన ప్రియురాలు సిరిని గెలిపించుకునేందుకు అప్పట్లో శ్రీహాన్ చాలా ప్రయత్నించాడు. ఇక వీరే కాకుండా.. యాంకర్ నేహా చౌదరీ కూడా బిగ్‏బాస్ కంటెస్టెంట్ గా రాబోతుందట. ఈమె ఐపీఎల్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఐపీఎల్ వ్యాఖ్యతగా పాపులర్ అయ్యింది. వీరే కాకుండా.. ప్రముఖ సింగర్ గీతామాధురి భర్త నందు, యూట్యూబర్ నిఖిల్, ఆర్జే సూర్య, యాంకర్ వర్షిణి, హీరో భరత్ సైతం బిగ్‏బాస్ ఇంట్లో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..