AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee Pannu: సహనాన్ని కోల్పోయిన తాప్సీ.. కెమెరామెన్లతో తీవ్ర వాగ్వాదం.. అసలు ఏమైందంటే..

ప్రమోషన్లలో భాగంగా వేదిక వద్దకు వచ్చిన తాప్సీ.. ఆ తర్వాత వెంటనే ఫోటోలు తీయడానికి ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే లోపలికి వెళ్లిపోయింది.

Taapsee Pannu: సహనాన్ని కోల్పోయిన తాప్సీ.. కెమెరామెన్లతో తీవ్ర వాగ్వాదం.. అసలు ఏమైందంటే..
Tapsee
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2022 | 4:15 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయకగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది తాప్సీ (Taapsee Pannu). అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో దోబారా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కానుంది. ప్రస్తుతం తాప్సీ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది. అయితే ఈ మూవీ ప్రమోష్లలో భాగంగా తాజాగా కెమెరామెన్లకు హీరోయిన్ తాప్సీకి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది.

ప్రమోషన్లలో భాగంగా వేదిక వద్దకు వచ్చిన తాప్సీ.. ఆ తర్వాత వెంటనే ఫోటోలు తీయడానికి ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే లోపలికి వెళ్లిపోయింది. దీంతో ఫోటోలకు కాస్త సమయం ఇవ్వాలని కెమెరామెన్స్ కోరారు. ఆమె కోసం దాదాపు రెండు గంటలుగా వెయిట్ చేస్తున్నామని.. ఫోటోలకు సమయం ఇవ్వాలని కెమెరామెన్స్ అడగ్గా.. నాపై ఎందుకు అరుస్తున్నారు ? అందులో నా తప్పు ఏంటీ ? అంటూ తిరిగి ప్రశ్నించింది తాప్సీ.

దీంతో మీ కోసం చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్నామంటూ కెమెరామెన్స్ అరిచారు. దీంతో తాప్సీ మాట్లాడుతూ.. ” దయచేసి నాతో గౌరవంగా మాట్లాడండి. నేను నా పని చేశాను. నేను రావాల్సిన ప్రతిచోటు సరైన సమయానికి వచ్చాను. మీరు నాతో మార్యదగా మాట్లాడతే.. నేను కూడా మర్యదగా మాట్లాడతాను” అంటూ వారితో వాగ్వాదానికి దిగింది తాప్సీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో తాప్సీ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.