- Telugu News Photo Gallery Vijay Devarakonda Ananya Panday warm welcome in vadodara by fans, photos goes viral
Liger: ఇదేం క్రేజ్‌రా నాయనా.. టాలీవుడ్ రౌడీపై పూల వర్షం కురిపిస్తూ ఫ్యాన్స్ హంగామా.. ఫొటోలు వైరల్
Liger Promotions: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండకు రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతుంది. తన అప్‌కమింగ్ మూవీ లైగర్ ప్రమోషన్ల కోసం ప్రధాన నగరాల్లో తిరుగుతున్న అతనిని చూసేందుకు ఫ్యాన్స్, ఫిల్మీ లవర్స్ ఎగబడుతున్నారు.
Updated on: Aug 09, 2022 | 2:07 PM

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండకు రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతుంది. తన అప్‌కమింగ్ మూవీ లైగర్ ప్రమోషన్ల కోసం ప్రధాన నగరాల్లో తిరుగుతున్న అతనిని చూసేందుకు ఫ్యాన్స్, ఫిల్మీ లవర్స్ ఎగబడుతున్నారు. మాల్స్ అన్నీ ఇసుకేస్తేరాలనంతగా జనసంద్రంగా మారిపోతున్నాయి

కాగా లైగర్ ఈవెంట్లకు వస్తోన్న క్రౌడ్‌ను కంట్రోల్ చేయలేక ఈవెంట్ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. అనుకున్నదానికంటే అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో షాక్ అవుతున్నారు. ఫ్యాన్స్‌ను అదుపుచేయడం కోసం ప్రోగ్రామ్ పూర్తి కాకముందే విజయ్‌ని అక్కడి నుంచి పంపించేస్తున్నారు

మొన్న ముంబై, నిన్న పాట్నా, నేడు గుజరాత్‌లలోనూ సేమ్ సీన్ రిపీటైంది. ఈక్రమంలో మాస్‌లో విజయ్‌కి ఉన్న క్రేజ్ చూసి బాలీవుడ్ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

లైగర్ ప్రమోషన్లకు సంబంధించి విజయ్ దేవరకొండ వీడియోలు, ఫొటోలు గత కొద్దిరోజుల నంఉచి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వీటిని చూసిన ప్రతిఒక్కరూ ఇదేం ఫాలోయింగ్‌రా బాబూ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ చిత్రం ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనన్యా పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.




