AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: లాల్ సింగ్ చద్దా సినిమా కోసం చైతూ అంత తీసుకున్నాడా ?.. హాట్ ‏టాపిక్‏గా చై రెమ్యునరేషన్..

స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతూ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 11న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

Naga Chaitanya: లాల్ సింగ్ చద్దా సినిమా కోసం చైతూ అంత తీసుకున్నాడా ?.. హాట్ ‏టాపిక్‏గా చై రెమ్యునరేషన్..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2022 | 4:57 PM

Share

అక్కినేని నాగార్జున నటవారసుడిగా చిత్రపరిశ్రమలోకి హీరోగా అరంగేట్రం చేసి సక్సెస్ అయ్యాడు నాగచైతన్య (Naga Chaitanya). జోష్ సినిమాతో కెరీర్ ఆరంభించిన చైతూ.. ఏమాయ చేసావే మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. తన 13 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్‏లో చై.. అనేక హిట్స్, ప్లాప్స్ చూశాడు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతూ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 11న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. అయితే ఇప్పుడు చైతూ రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా చైతూ ఒక్కో సినిమాకు దాదాపు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. ఇటీవల ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చైతన్య లాల్ సింగ్ చద్దా సినిమా కోసం రూ. 5 కోట్లు తీసుకున్నారని అని అన్నారు. అలాగే సోలోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడని.. ఇండస్ట్రీలో చై సరికొత్త దారిలో వెళ్తున్నట్లు చెప్పారు. ఇక ఇప్పుడు లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చైతూ.. త్వరలోనే మరిన్ని హిందీ చేసే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం నాగచైతన్య. డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలిసి తమిళ, తెలుగు ద్విభాషా సినిమా చేయనున్నాడు.

సినిమాలు మాత్రమే కాకుండా చైతన్య వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఆసియా వంటకాలపై ఎక్కువ అనుబంధం ఉందని.. ఆ అనుభూతిని హైదరాబాద్ కు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా చైతూకు కార్లు, బైక్స్ అంటే ఎక్కువ ఇష్టం. ఇప్పటికే అతని వద్ద కోట్ల రూపాయాలు విలువ చేసే బైక్స్, కార్లు ఉన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్