Rashmika Mandanna: నేషనల్ క్రష్ డిమాండ్.. అక్కినేని వారబ్బాయితో జతకట్టనున్న రష్మిక..

అంతేకాకుండా ఆగస్ట్ 5న విడుదలైన సీతారామం చిత్రంలో రష్మిక నటనకు ప్రశంసలు అందుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇక ఇప్పుడు రష్మిక అక్కినేని వారబ్బాయితో జతకట్టనుందట.

Rashmika Mandanna: నేషనల్ క్రష్ డిమాండ్.. అక్కినేని వారబ్బాయితో జతకట్టనున్న రష్మిక..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 09, 2022 | 3:16 PM

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna). తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, హిందీ భాషలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది నేషనల్ క్రష్. ఇటీవల పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాందించుకుంది ఈ చిన్నది. హిందీలో యానిమల్, మిస్టర్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఇక తెలుగులో పుష్ప 2 మూవీ కోసం వెయిట్ చేస్తుంది. అంతేకాకుండా ఆగస్ట్ 5న విడుదలైన సీతారామం చిత్రంలో రష్మిక నటనకు ప్రశంసలు అందుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇక ఇప్పుడు రష్మిక అక్కినేని వారబ్బాయితో జతకట్టనుందట. వీరిద్దరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా.

సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ పరశురామ్. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించింది. అయితే పరశురామ్ తన తర్వాతి చిత్రాన్ని యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో తెరకెక్కించనున్నట్లు గత కొంత కాలంగా టాక్ నడుస్తోంది. ఈ ప్రాజెక్టులో రష్మిక కథానాయికగా నటించనుందట. పరశురామ్ తెరకెక్కించిన సూపర్ హిట్ గీతా గోవిందం మూవీలో రష్మిక నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి తన మూవీలో నేషనల్ క్రష్ ను ఎంపిక చేశాడట. చైతూతో మొదటిసారి రష్మిక జతకట్టనుంది. ప్రస్తుతం చైతూ లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 11న హిందీతోపాటు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది.

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు