Karthika Deepam: కార్తీక దీపంలోకి వంటలక్క రీఎంట్రీ ఇవ్వనుందా ? .. ప్రోమోతో హింట్ ఇచ్చేసిన దీపక్క..

అయితే అనుహ్యంగా బాంబ్ బ్లాస్ అంటూ దీప, డాక్టర్ బాబుల కథకు ముగింపు పలికారు డైరెక్టర్. ఆ తర్వాత కొత్త జనరేషన్ అంటూ మరో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

Karthika Deepam: కార్తీక దీపంలోకి వంటలక్క రీఎంట్రీ ఇవ్వనుందా ? .. ప్రోమోతో హింట్ ఇచ్చేసిన దీపక్క..
Karthika Deepam
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 10, 2022 | 6:21 PM

బుల్లితెరపై దాదాపు నాలుగేళ్లు అగ్రస్థానంలో ఏకపక్షంగా కొనసాగింది కార్తీక దీపం సీరియల్ (Karthika Deepam). టెలివిజన్ రంగంలో అనేక సీరియల్స్ పోటీగా వస్తున్నా.. చెక్కుచెదరకుండా రేటింగ్‏లో మొదటి స్థానంలో దూసుకుపోయింది. ఈ సీరియల్ ఇంతగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాందించుకోవడానికి కారణం ముఖ్యం కారణం వంటలక్క. తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‏ను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన నటనతో.. కంటిచూపుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే అనుహ్యంగా బాంబ్ బ్లాస్ అంటూ దీప, డాక్టర్ బాబుల కథకు ముగింపు పలికారు డైరెక్టర్. ఆ తర్వాత కొత్త జనరేషన్ అంటూ మరో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే వంటలక్క.. డాక్టర్ బాబు కథ ముగియడంతో కార్తీక దీపం సీరియల్ టీఆర్పీ రేటింగ్‏లో రెండవ స్థానంలోకి పడిపోయింది.

సౌర్య, నిరుపమ్, హిమ, శోభ అంటూ తీసుకువచ్చిన కథ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదనే చెప్పుకోవాలి. దాదాపు నాలుగేళ్లు అగ్రస్థానంలో నిలిచిన కార్తీకదీపం ఇప్పుడు టాప్ 10లో ఓ స్థానాన్ని సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా కార్తీక దీపం అభిమానులకు శుభవార్త చెప్పింది వంటలక్క ప్రేమీ విశ్వనాథ్. తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోతో ప్రేక్షకులను అయోమయంలో పడేసింది. మునుపటి దీపగా అదే కట్టు.. బొట్టుతో మేకప్ అయ్యి కనిపించింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి దీప మేడమ్ షాట్ రెడీ అనగా.. వస్తున్నా అంటూ నవ్వుతూ కనిపించింది. ఈ వీడియోను షేర్ చేస్తూ. వస్తున్నా.. మీ కోసం అంటూ కార్తీకదీపం హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. దీంతో దీపక్క మళ్లీ కార్తీక దీపంలోకి రీఎంట్రీ ఇస్తుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మిమ్మల్ని మళ్లీ చూడడం సంతోషంగా ఉంది.. వెల్ కమ్ మేడమ్.. సూపర్, డాక్టర్ బాబు వస్తున్నాడా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వంటలక్క, డాక్టర్ బాబుల కూతుర్లు పెద్దవారు కావడంతో దీప లుక్ మారాల్సి ఉంది. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో వంటలక్క ఓల్డ్ లుక్‏లో కనిపించేసరికి నిజంగానే దీప మళ్లీ రీఎంట్రీ ఇస్తుందా ? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి కార్తీక దీపంలో మళ్లీ వంటలక్క సందడి చేయనుందా ? లేదా ? అనేది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే