AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: దిమ్మతిరిగే కలెక్షన్స్.. పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..

తాజాగా మరోసారి ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

Mahesh Babu: దిమ్మతిరిగే కలెక్షన్స్.. పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..
Pokiri
Rajitha Chanti
|

Updated on: Aug 10, 2022 | 4:03 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం పోకిరి. వీరిద్దరి కలయికలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ గతంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇలియనా, ప్రకాష్ రాజ్, నాజర్, అశీష్ విద్యార్థి కీలకపాత్రలలో నటించిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడమే కాకుండా.. మహేష్ కెరీర్‏లోనే అతి పెద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. తాజాగా మరోసారి ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో పోకిరి సినిమా మళ్లీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఉత్తరాంధ్రలో ఈ మూవీ స్పెషల్ షో వెయ్యగా దానికి 24 లక్షల 89 వేల 638 రూపాయాల గ్రాస్ వసూలు కాగా.. గుంటురు జిల్లాలో మొత్తం 33 షోలు వేయగా.. 13 లక్షలకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. కృష్ణ జిల్లాలో మొత్తం 30 షోలు వేయగా.. రూ. 10 లక్షలకుపైగా రాబట్టిందట. చాలాకాలం తర్వాత మళ్లీ స్పెషల్ షోగా వేసిన పోకిరి చిత్రం ఈ రేంజ్ లో వసూళ్లు చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం మహేష్.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోయే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. అంతేకాకుండా.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలోనూ మహేష్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!