AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఇలా చేస్తే ఎలా డార్లింగ్.. తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్.. మొర ఆలకించవూ

రీసెంట్‌గా రాధేశ్యామ్సి నిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో డార్లింగ్ నెక్ట్స్ మూవీ కోసం ఆడియన్స్ మరింత ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

Prabhas: ఇలా చేస్తే ఎలా డార్లింగ్.. తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్.. మొర ఆలకించవూ
Prabhas
Ram Naramaneni
|

Updated on: Aug 10, 2022 | 4:38 PM

Share

Tollywood: గత ఎనిమిదేళ్లలో ప్రభాస్ నుంచి నాలుగంటే నాలుగే సినిమాలు వచ్చాయి. డార్లింగ్ రేంజ్‌ ఎంత స్పీడుగా పెరుగుతుందో… సినిమాల నెంబర్ మాత్రం అదే స్పీడుగా తగ్గుతోంది. తాజాగా త్వరలో రిలీజ్ అవుతుందనుకుంటున్న ఓ మూవీ కూడా ఏడాది పాటు వాయిదా పడింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్సన్‌ మొదలైంది. రీసెంట్‌గా రాధేశ్యామ్(Radhe Shyam) సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో డార్లింగ్ నెక్ట్స్ మూవీ కోసం ఆడియన్స్ మరింత ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ప్రభాస్ కూడా నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టి… గట్టిగానే హడావిడి చేశారు. కానీ ఈ హడావిడి తెర మీద చూడాలంటే మాత్రం ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే అన్న టాక్ వినిపిస్తోంది. ఆదిపురుష్(adipurush) షూటింగ్ ఆల్రెడీ ఫినీష్ అయ్యింది. సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్‌ కూడా లాక్ చేశారు మేకర్స్‌. కానీ భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కుతున్న మూవీ కావటంతో అనుకున్న టైమ్‌కు రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు ఆడియన్స్‌ను వెంటాడుతున్నాయి.

సలార్ షూటింగ్ కూడా ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతోంది. ఆల్రెడీ మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. దీంతో ఆదిపురుష్ రిలీజ్ అయినా… కాకపోయినా.. నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌కు సలార్‌ రిలీజ్ పక్కా అని ఫిక్స్‌ అయ్యారు ఆడియన్స్‌. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించటం లేదు. సలార్‌ రిలీజ్‌ను వాయిదా వేశారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతుండటం… పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ ఇంత వరకు షురూ కాకపోవటంతో సమ్మర్‌కు సలార్‌ రిలీజ్ కష్టమే అన్నది ఇండస్ట్రీ టాక్‌. అంతేకాదు ఈ సినిమాను ఏకంగా నెక్ట్స్ ఇయర్ దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట మూవీ టీమ్‌. ఈ న్యూస్‌ వైరల్‌ కావటంతో డార్లింగ్‌తో సినిమా అంటే డీలే తప్పదని ఫిక్స్ అవుతున్నారు డై హార్డ్‌ ఫ్యాన్స్‌.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..

Follow Us
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..