Rashmika Mandanna: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ రేంజ్‌కి రష్మిక ఎలా చేరుకున్నారు? శ్రీవల్లి చెప్పిన సక్సస్ సీక్రెట్స్
Rashmika Mandanna: ఫిలిం ఇండస్ట్రీలో టాప్ చైర్‌కు రీచ్ అవ్వాలంటే కావాల్సిందేంటి..? ఈ ఫార్ములాను క్రాక్ చేయటం తలపండిన సినీ ఉద్దండులకు కూడా సాధ్యం కాలేదు. కానీ తాను మాత్రం ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ కనిపెట్టా అంటున్నారు నేషనల్ క్రష్ రష్మిక.
ఫిలిం ఇండస్ట్రీలో టాప్ చైర్‌కు రీచ్ అవ్వాలంటే కావాల్సిందేంటి..? ఈ ఫార్ములాను క్రాక్ చేయటం తలపండిన సినీ ఉద్దండులకు కూడా సాధ్యం కాలేదు. కానీ తాను మాత్రం ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ కనిపెట్టా అంటున్నారు నేషనల్ క్రష్ రష్మిక (Rashmika Mandanna). అందుకే షార్ట్ స్పాన్‌లోనే నేషనల్ బ్యూటీగా ఫుల్ ఫామ్‌లో ఉన్నారట ఈ క్రేజీ స్టార్. శ్రీవల్లిగా హోల్ ఇండియాను షేక్ చేసిన రష్మిక మందన్న… అంతకు ముందే నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ కూడా సొంతం చేసుకున్నారు. కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ బిజీ స్టార్ అనిపించుకుంటున్నారు. అయితే ఈ రేంజ్‌కు రావటం వెనుక సీక్రెట్ ఏంటో కూడా రివీల్ చేశారు రష్మిక మందన్న.
కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా పరిచయం అయిన రష్మికకు… ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే టాలీవుడ్ ఛాన్స్ కూడా తలుపు తట్టింది. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఆ సినిమా రిలీజ్‌కు ముందే గీత గోవిందం సినిమాను కూడా సైన్ చేశారు. ఇలా క్రేజీ ఆఫర్స్ తనను వెతుక్కుంటూ రావటం వల్లే ఈ రోజు ఈ పోజిషన్‌లో ఉన్నా అంటున్నారు.
అయితే తన సక్సెస్ సీక్రెట్ కేవలం లక్ మాత్రమే కాదన్న విషయాన్ని గట్టిగానే చెబుతున్నారు ఈ కూర్గ్ బ్యూటీ. అవకాశాలు వచ్చినా… వాటిని క్యాష్ చేసుకోవటంలో తన హార్డ్ వర్క్ కూడా చాలానే ఉందన్నారు. తనకు ఇచ్చిన పాత్రలో తెర మీద కనిపించే తీరు… మేకర్స్‌కు నచ్చటం వల్లే ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయంటూ అసలు విషయాన్ని బయట పెట్టారు. లక్ ప్లస్ హర్ట్ వర్క్ ఇదే సక్సెస్ సీక్రెట్ అంటున్నారు రష్మిక మందన్న.
రష్మిక లేటెస్ట్ ఫోటోషూట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలు చదవండి..