AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Artist: రాజశేఖర్ కు కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్టు.. కాలక్రమంలో హీరోయిన్ గా నటించింది.. ఆ నటి ఎవరో తెలుసా..!

శ్రీదేవి బడిపండితులు సినిమాలో ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించింది.. అనంతరం కాలక్రమంలో అదే ఎన్టీఆర్ వేటగాడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం వంటి అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఓ బాలనటి.. ఓ సినిమాలో హీరోకి కూతురుగా నటించింది..

Child Artist: రాజశేఖర్ కు కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్టు.. కాలక్రమంలో హీరోయిన్ గా నటించింది.. ఆ నటి ఎవరో తెలుసా..!
Rajasekhar
Surya Kala
|

Updated on: Aug 11, 2022 | 10:22 AM

Share

Child Artist: చలన చిత్ర పరిశ్రమలో హీరోకి ఉన్నంత కెరీర్ సమయం .. హీరోయిన్స్ కు ఉండదన్న సంగతి తెలిసిందే. వెండి తెరపై బాలనటిగా అడుగు పెట్టి.. కాలక్రమంలో హీరోయిన్స్ గా మారిన విజయనిర్మల, రోహిణి, శ్రీదేవి, మీనా, రాశి వంటి నటీమణులు ఎందరో ఉన్నారు. అయితే శ్రీదేవి బడిపండితులు సినిమాలో ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించింది.. అనంతరం కాలక్రమంలో అదే ఎన్టీఆర్ వేటగాడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం వంటి అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఓ బాలనటి.. ఓ సినిమాలో హీరోకి కూతురుగా నటించింది.. అనంతరం అదే హీరోకి జోడీగా నటించింది.. మరి హీరో హీరోయిన్లు ఎవరో గుర్తుపట్టారా..

టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఓ బాలనటి.. అనంతరం.. కాలక్రమంలో రాజశేఖర్ కు జోడీగా నటించింది. రాజశేఖర్ వందేమాతరం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. కాలక్రమంలో ఆహుతి, అంకుశం, ఆగ్రహం వంటి వరస సినిమాలతో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు సంపాదించుకున్నారు.. అయితే రాజశేఖర్ సినీ కెరీర్ లో మమతల కోవెల, అక్కాచెల్లెళ్లు వంటి  సెంటిమెంట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలకు మహిళా, ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. రాజశేఖర్, సుహాసిని హీరో, హీరోయిన్ గా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన మమతల కోవెల సినిమా అప్పట్లో సూపర్ సినిమా. ఈ సినిమాలో రాజశేఖర్, సుహాసినిల కూతురుగా చైల్డ్ ఆర్టిస్ట్ రాశి నటించింది.

Rajasekhar Rashi 1

Rajasekhar Rashi 1

రాజశేఖర్ ముద్దుల కూతురుగా రాశి అలరించింది. అతి తక్కువ సమయంలోనే రాశి బాలనటి నుంచి హీరోయిన్ గా శుభాకాంక్షలు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రమంలో అదే రాశి.. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరో గా నటించిన నేటి గాంధీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే రాశి కెరీర్ ఎంత స్పీడ్ గా సక్సెస్ అందుకుందో.. అంత స్పీడ్ గా ముగిసింది. అయితే ఇప్పుడు రాశి.. జానకి కలగనలేదు అనే సూపర్ హిట్ సీరియల్ లో హీరో కి అమ్మగా నటిస్తూ.. బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి
Rajasekhar Rashi 2

Rajasekhar Rashi 2

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..