Allu Bobby: కమల్ హాసన్ కు మనవడిగా నటించిన అల్లువారబ్బాయి .. అద్భుత కళాఖండం.. ఏ సినిమానో తెలుసా..

Allu Bobby: చైల్డ్ హుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి... కాలక్రమంలో ఇప్పుడు స్టార్ హీరోలుగా, హీరోయిన్లు రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఈరోజు ఐకాన్ స్టార్ గా అభిమానులను అలరిస్తున్న అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో సినిమాలో బాలనటిగా నటించాడు..

Allu Bobby: కమల్ హాసన్ కు మనవడిగా నటించిన అల్లువారబ్బాయి .. అద్భుత కళాఖండం.. ఏ సినిమానో తెలుసా..
Kamal Allu Arjun
Surya Kala

|

Aug 15, 2022 | 12:41 PM

Allu Bobby: బాల్యం ఎవరికైనా అపురూపమే.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తే ప్రతి సంఘటనను అందరూ ఎంతగానో ఇష్టపడతారు. ముఖ్యంగా చిన్నతనంలో ఫోటోలను చూడడం ఇష్టపడతారు. మరి కొంతమంది నటీనటులైతే.. చిన్నతనంలో బాలనటిగా వెండి తెరపై ఎంట్రీ ఇస్తే.. వారికీ ఆ సినిమాలు జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతాయి. అంతేకాదు చైల్డ్ హుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి… కాలక్రమంలో ఇప్పుడు స్టార్ హీరోలుగా, హీరోయిన్లు రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారు. అయితే ఫ్యామిలీ నేపథ్యంలో సరదాగా బాలనటుడిగా ఒకటి రెండు సినిమాల్లో నటించిన వారు కూడా ఉన్నారు.. అల్లువారబ్బాయి అలాంటి కోవకు చెందిన వ్యక్తి.. ఒక స్టార్ హీరో సినిమాలో బాలనటిగా నటించాడు.. ఆ సినిమా ఏమిటి.. ఆ హీరో ఎవరో తెలుసా..!

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ ది ఒక ప్రత్యేక స్థానం. స్వాతిముత్యం, భార‌తీయుడు, ద‌శావతారం వంటి సినిమాల‌తో అప్ప‌ట్లోనే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు.  దేశం గర్వించదగిన నటుల్లో ఒకరు కమల్ హాసన్.. అందుకనే ఆయనతో నటించాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. కానీ ఆ అదృష్టం మాత్రం కొంతమందికే దక్కుతుంది. ఆలాంటి అదృష్టవంతుడిలో ఒకడు అల్లువారబ్బాయి. అల్లు బాబీ నిర్మాతగా సహా నిర్మాతగా ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్నాడు.. అయితే చిన్నతనంలో బాలనటుడిగా కూడా నటించాడు. మెగాస్టార్ చిరంజీవి విజేత సినిమాతో పాటు.. కమల్ హాసన్, కె.విశ్వనాధ్ కాంబినేషన్ లో అద్భుత కళాసృష్టి స్వాతి ముత్యం సినిమాలో బాల నటుడిగా నటించాడు. అల్లు అర్జున్ కమల్ హాసన్ కి మనవడిగా చిన్న పాత్రలో కనిపించాడు.

కళాతపస్వి  కె. విశ్వనాధ్ తో అల్లు అరవింద్ కి పరిచయం ఉంది.. దీంతో విశ్వనాథ్ షూటింగ్ సమయంలో అల్లు అరవింద్ కూడా అప్పుడప్పుడు వెళ్లేవారట.. అలా స్వాతిముత్యం సినిమా లో నటించే చిన్న పిల్లల పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారట విశ్వనాధ్ గారు.. ఆ రోజు షూటింగ్ జరుగుతున్న ప్లేస్ కి అల్లు అరవింద్ తన పెద్ద కుమారుడు బాబీని కూడా తీసుకుని వెళ్లారట.. అప్పుడుఅల్లువారబ్బాయిని  చూసిన కళాతపస్వి  ‘మీ అబ్బాయిని మా సినిమాలో ఒక్క చిన్న పాత్ర కోసం తీసుకోవచ్చా.. రెండు, మూడు రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుందని అడిగారట.. స్వయంగా దేవుడే వరమిస్తానంటే.. పూజారి కాదంటాడా.. విశ్వనాథ్ వంటి దర్శకుడు అడగడంతో వెంటనే స్వాతిముత్యం సినిమాలో నటించడానికి ఒకే చెప్పారట.

అలా ఒక గొప్ప సినిమా స్వాతి ముత్యంలో లెజెండరీ నటుడు కమల్ హాసన్ కు మనవడిగా బాలనటుడిగా నటించాడు బాబీ.. అయితే కాలక్రమంలో బాబీ తమ్ముడు అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరోగా అడుగు పెట్టి..  ఇప్పుడు యూత్ ఐకాన్ స్టార్ గా దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక అల్లు శిరీష్ కూడా హీరోగా పలు సినిమాల్లో నటిస్తూ.. సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu