AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suhasini Birthday: బహుముఖ ప్రజ్ఞాశాలి .. సుమధుర హాసిని సుహాసిని పుట్టిన రోజు నేడు.. ఆమె గురించి మీకు తెలియని నిజాలు

150న మంది యువకుల మధ్య ఈ కోర్సు చేసిన ఏకైక అమ్మాయిగా సుహాసిని నిలిచారు. అంతేకాదు పలు సినిమాలకు సినిమా ఛాయాగ్రాఫర్ కూడా పనిచేశారు. అలా సిని పరిశ్రమలో అడుగు పెట్టిన సుహాసిని కాలక్రమంలో హీరోగా మారింది.

Suhasini Birthday: బహుముఖ ప్రజ్ఞాశాలి .. సుమధుర హాసిని సుహాసిని పుట్టిన రోజు నేడు.. ఆమె గురించి మీకు తెలియని నిజాలు
Suhasini Maniratnam
Surya Kala
|

Updated on: Aug 15, 2022 | 2:14 PM

Share

Suhasini Birthday: సినీ నేపధ్య కుటుంబం నుంచి వచ్చిన సుహాసిని 1980 లో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించి దక్షిణ స్టార్ హీరోయిన్ గా ఖ్యాతిగాంచిన సుహాసిని పుట్టిన రోజు నేడు. 1988లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక తనయుడు.. ప్రస్తుతం విదేశాల్లో చదువుని అభ్యసిస్తున్నాడు. నందన్ మణిరత్నంకు రాజకీయాలపై ఆసక్తి..

తమిళనాడులో చెన్నైలో 1961 ఆగస్టు 15న సుహాసిని  జన్మించింది. సుహాసిని, భారతీయ నటుడు కమల హాసన్ అన్న, నటుడు, లాయర్ చారు హాసన్ కూతురు. తొలిసారిగా సుహాసిని 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో నటించగా.. తెలుగులో కొత్త జీవితాలు సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టారు. సుహాసిని మంచి నటిమాత్రమే కాదు.. కథలు రాస్తారు.. సినిమాలను కూడా నిర్మిస్తారు. దర్శకురాలు కూడా..

ఎటువంటి పాత్రలైనా సరే ఆ పాత్రకు జీవం పొసే నటి సుహాసిని. తండ్రి  చారుహాసన్ సుహాసిని ఇంజనీర్ చదివించాలని కోరుకున్నారు. అయితే బాబాయ్ కమల్ హాసన్ .. సుహాసినిని సినిమా ఫోటోగ్రఫీ కోర్సులో చేర్పించారు. అప్పటిలో ఈ కోర్సు చదివే అమ్మాయిలు తక్కువ .. దీంతో 150న మంది యువకుల మధ్య ఈ కోర్సు చేసిన ఏకైక అమ్మాయిగా సుహాసిని నిలిచారు. అంతేకాదు పలు సినిమాలకు సినిమా ఛాయాగ్రాఫర్ కూడా పనిచేశారు. అలా సిని పరిశ్రమలో అడుగు పెట్టిన సుహాసిని కాలక్రమంలో హీరోగా మారింది. అయితే నటిగా సినిమాల్లో నటించడానికి తండ్రి చారుహాసన్ ప్రోత్సహించినా.. బాబాయ్ కమల్ హాసన్ నిరాకరించారు. మొదటి సినిమాతోనే మంచి నటిగా తమిళనాడునుంచి అందుకున్నారు. కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ లాల్, ముమ్మట్టి వంటి అనేకమంది స్టార్ హీరోలతో సుహాసిని నటించారు.

ఇవి కూడా చదవండి

సుహాసిని 1985లో కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన సింధుభైరవిలో నటనకు గాను 1986లో ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు  అందుకున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తండ్రి శివకుమార్ హీరోగా నటించారు. స్వాతి, సంసారం ఒక చదరంగం, స్రవంతి, మంచు పల్లకి, మంగమ్మగారి మనుమడు, పుణ్య దంపతులు , గౌతమి వంటి అనేక సినిమాలల్లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
తండ్రికొడుకుల ప్రాణం తీసిన వేగం..కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?