AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: మొన్న భార్యకు.. ఇప్పుడు అమ్మకు.. మహిళా దినోత్సవం వేళ తల్లికి అల్లు అర్జున్ ఖరీదైన కానుక

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. మూడు రోజుల క్రితం తన పెళ్లి రోజు సందర్భంగా భార్య స్నేహారెడ్డికి ఖరీదైన బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పుడు తల్లికి కూడా ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు బన్నీ.

Allu Arjun: మొన్న భార్యకు.. ఇప్పుడు అమ్మకు.. మహిళా దినోత్సవం వేళ తల్లికి అల్లు అర్జున్ ఖరీదైన కానుక
Allu Arjun
Basha Shek
|

Updated on: Mar 09, 2026 | 9:05 PM

Share

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం తన తమ్ముడు హీరో అల్లు శిరీష్ పెళ్లి పనులతో బిజీగా ఉంటున్నాడు. తన పెళ్లి రోజు అయిన మార్చి 06 నే శిరీష్ కూడా పెళ్లిపీటలెక్కాడు. నయనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. తన పెళ్లి రోజును పురస్కరించుకుని భార్య స్నేహారెడ్డికి ఖరీదైన బెంజ్ ఏఎమ్‌జీ మోడల్ కారుని బహుమతిగా ఇచ్చాడు. దీని ధర సుమారు రూ.3-4 కోట్లని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. ఇప్పుడు తల్లికి కూడా ఖరీదైన కారుని ఇచ్చాడు బన్నీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లు నిర్మలకు బ్రాండ్ న్యూ లెక్సస్ కారును బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు అల్లు అర్జున్. తద్వారా అమ్మపై తనకున్న ప్రేమను, కృతజ్ఞత భావాన్ని ఈ విధంగా చాటుకున్నాడు బన్నీ. ఇక కొడుకు ఇచ్చిన ఈ ఊహించని బహుమతితో అల్లు నిర్మల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరలవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మపై ఐకాన్ స్టార్ చూపించిన ప్రేమ అద్బుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సుమారు రూ. 800 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు లోకేశ్ కనగరాజ్‌తోనూ ఓ మూవీ కమిట్ అయ్యాడు బన్నీ. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమాల నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరలవుతోన్న వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోహిత్ బాటలోనే కోహ్లీ.. వన్డే ప్రపంచ కప్‌నకు ముందే రిటైర్మెంట్..?
రోహిత్ బాటలోనే కోహ్లీ.. వన్డే ప్రపంచ కప్‌నకు ముందే రిటైర్మెంట్..?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు.. జులై 19 లోపు అప్లై చేయండి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు.. జులై 19 లోపు అప్లై చేయండి
దహనం, ఖననం కాకుండా అంత్యక్రియల కోసం ప్రత్యేక పద్ధతులు
దహనం, ఖననం కాకుండా అంత్యక్రియల కోసం ప్రత్యేక పద్ధతులు
కళ్ళు, జుట్టు, చర్మం, బిపి, షుగర్ అన్నిటికీ రామబాణం ఈ స్వీట్
కళ్ళు, జుట్టు, చర్మం, బిపి, షుగర్ అన్నిటికీ రామబాణం ఈ స్వీట్
ముక్కుపుడక కేవలం అందానికే కాదు.. జ్యోతిష్యం ప్రకారం దీన్ని..
ముక్కుపుడక కేవలం అందానికే కాదు.. జ్యోతిష్యం ప్రకారం దీన్ని..
గంభీర్ కాదు.. ఆయన వల్లే రోహిత్ శర్మ రిటైర్మెంట్..?
గంభీర్ కాదు.. ఆయన వల్లే రోహిత్ శర్మ రిటైర్మెంట్..?
ఏపీలో మినీ అమెజాన్ ఫారెస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
ఏపీలో మినీ అమెజాన్ ఫారెస్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
క్రెడిట్ కార్డు ద్వారా ఈ ట్రాన్సాక్షన్లు చేస్తున్నాారా..?
క్రెడిట్ కార్డు ద్వారా ఈ ట్రాన్సాక్షన్లు చేస్తున్నాారా..?
పామ్ ఆయిల్, డాల్డా, కొబ్బరి నూనె.. మీరు కొనేది నెయ్యేనా..?
పామ్ ఆయిల్, డాల్డా, కొబ్బరి నూనె.. మీరు కొనేది నెయ్యేనా..?
మరో 2 రోజుల్లోనే EAPCET 2026 కౌన్సెలింగ్‌ షురూ.. రంగం సిద్ధం
మరో 2 రోజుల్లోనే EAPCET 2026 కౌన్సెలింగ్‌ షురూ.. రంగం సిద్ధం