AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటగాళ్లను అందాలతో క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు.. ముద్దుగుమ్మలతో క్రికెటర్ల ప్రేమాయణాలు..!

మ్యాచ్‌లతో బిజీగా ఉంటూనే.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లతో లవ్ ట్రాక్స్ నడుపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ యంగ్ క్రికెటర్ల ప్రేమాయణాల గురించే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ జనరేషన్‌లో క్రికెట్ - బాలీవుడ్ బంధానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్‌గా ముందుగా వినిపించే పేర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్.

ఆటగాళ్లను అందాలతో క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు.. ముద్దుగుమ్మలతో క్రికెటర్ల ప్రేమాయణాలు..!
Hardik Pandya, Ishan Kishan
Praveen Vadla
| Edited By: |

Updated on: Mar 09, 2026 | 8:22 PM

Share

ఇండియాలో క్రికెట్, సినిమా.. ఈ రెండింటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ రెండు వేర్వేరు రంగాలు అయినప్పటికీ, వీటి మధ్య ఉన్న బంధం మాత్రం ఇప్పటిది కాదు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ – షర్మిలా టాగోర్ కాలం నుంచి విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ వరకు ఈ గ్లామర్ ఫీల్డ్స్ ఎప్పుడూ కలిసే ఉంటున్నాయి. ఇప్పుడు అదే ట్రెండ్‌ను టీమిండియా యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్స్ కూడా ఫాలో అవుతున్నారు. మ్యాచ్‌లతో బిజీగా ఉంటూనే.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లతో లవ్ ట్రాక్స్ నడుపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ యంగ్ క్రికెటర్ల ప్రేమాయణాల గురించే హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ జనరేషన్‌లో క్రికెట్ – బాలీవుడ్ బంధానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్‌గా ముందుగా వినిపించే పేర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్.

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కూతురు, హీరోయిన్ అతియా శెట్టితో పీకల్లోతు ప్రేమలో మునిగి, ఆ తర్వాత ఘనంగా వివాహం చేసుకుని సెటిల్ అయ్యాడు. ఇక స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం బాలీవుడ్ నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రెండేళ్ళ కింద వీరిద్దరూ విడిపోయినప్పటికీ వీళ్ళ లవ్ స్టోరీ అప్పట్లో ఓ సెన్సేషన్. గ్రౌండ్‌లో వీళ్లు కొట్టే సిక్సర్ల కంటే, హీరోయిన్లతో వీళ్ళ రొమాన్స్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. తాజాగా మరో మోడల్ మెహీకా శర్మతో రిలేషన్‌లో ఉన్నాడు హార్ధిక్. ఇండియా కప్పు గెలిచిన తర్వాత ఈ ఇద్దరూ గ్రౌండ్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏ కెమెరాలో చూసినా ఈ ప్రేమ పక్షులే కనిపించారు.

టీమిండియా యంగ్ సెన్సేషన్, డాషింగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఈ లిస్ట్‌లో ముందున్నాడు. మోడల్, వర్ధమాన నటి అయిన అదితి హుండియాతో ఇషాన్ కిషన్ లవ్‌లో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఇషాన్ ఆడుతుంటే, స్టాండ్స్‌లో అదితి సందడి చేయడం అభిమానులకు కొత్తేమీ కాదు. వీళ్లిద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్లిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇద్దరూ కలిసి కనిపించారు. వీళ్ల జోడీని చూసాక.. వీళ్ళ రిలేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. మరోవైపు టీమిండియా మరో స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ కూడా బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేసినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇలా మన కుర్రాళ్లంతా హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతున్నారు.

టీమిండియాలోకి దూకుడుగా ఎంట్రీ ఇచ్చిన మరో యంగ్ ప్లేయర్ పృథ్వీ షా కూడా ప్రేమ వ్యవహారాల్లో తక్కువేం కాదు. నటి, మోడల్ నిధి తపాడియాతో పృథ్వీ షా పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు మొన్నటి వరకు. వాలెంటైన్స్ డే రోజున ఆమెను మై వైఫ్ అంటూ పృథ్వీ షా చేసిన ఓ పోస్ట్ అప్పట్లో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. పబ్లిక్ ఈవెంట్స్‌కు సైతం వీళ్ళు వచ్చారు.. కానీ ఇప్పుడు నిధితో విడిపోయిన పృథ్వీ.. ఇప్పుడు ఆకృతి అగర్వాల్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ నటించిన ఈ బ్యూటీతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు ఈ ముంబై క్రికెటర్. కేవలం వీళ్లే కాదు.. డొమెస్టిక్ క్రికెట్ ఆడే చాలా మంది కుర్రాళ్లు కూడా మోడల్స్, హీరోయిన్లతో డేటింగ్ చేస్తూ బాలీవుడ్, టాలీవుడ్ పార్టీల్లో తెగ సందడి చేస్తున్నారు.

మొత్తానికి చూసుకుంటే క్రికెట్ పిచ్‌పై బౌలర్లను ఉతికి ఆరేసే మన బ్యాటర్లు.. హీరోయిన్ల అందాల ముందు మాత్రం క్లీన్ బౌల్డ్ అయిపోతున్నారు. ఒకప్పుడు క్రికెటర్స్ అంటే కేవలం ఆటకు మాత్రమే పరిమితం అయ్యేవారు, కానీ ఇప్పుడు వాళ్ల లైఫ్‌స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్, ఫిట్‌నెస్ అచ్చం సినిమా హీరోలను తలపిస్తున్నాయి. అందుకే సినిమా తారలు కూడా మన క్రికెటర్ల వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రికెట్ సినిమా కాంబినేషన్ ఎప్పటికీ సూపర్ హిట్టే అని మన కుర్రాళ్లు మరోసారి ప్రూవ్ చేస్తున్నారు. ముందు ముందు ఈ లిస్ట్‌లో ఇంకెంత మంది యంగ్ క్రికెటర్లు చేరుతారో చూడాలి..!

Follow Us