Shivamogga: బ్యానర్‌పై దుమారం.. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ.. కర్ఫ్యూ విధించిన పోలీసులు..

హింసపై విచారణ కొనసాగుతోందన్నారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. నిందితుల ఆస్తులను జప్తు చేయాలని కలెక్టర్‌కు లేఖ రాశారు..

Shivamogga: బ్యానర్‌పై దుమారం.. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ.. కర్ఫ్యూ విధించిన పోలీసులు..
Shivamogga
Follow us

|

Updated on: Aug 16, 2022 | 1:02 PM

Shivamogga violence: కర్ణాటకలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సావర్కర్ పోస్టర్ కేంద్రంగా వివాదం రాజుకుంది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శివమొగ్గలోని గాంధీ బజార్ ప్రాంతంలో అమీర్ అహ్మద్ సర్కిల్లో వీర్ సావర్కర్ పోస్టర్‌ వేశారు. ఆ పోస్టర్‌ గొడవకు కేంద్ర బిందువైంది. హిందూ గ్రూప్స్ కావాలనే ఆ పోస్టర్‌ను ఏర్పాటు చేశాయని దానికి వ్యతిరేకంగా కొందరు ముస్లిం యువత ఆందోళనకు దిగారు. సావర్కర్ పోస్టర్ అక్కడ నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. దాంతో హిందూ సంస్థలు ఆందోళనకు దిగారు. దీంతో కలకలం రేగింది. ఇరువర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది.

బ్యానర్ విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రేమ్ సింగ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు నిందితులను గుర్తించారు పోలీసులు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేశారు.మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టుగా వివరించారు. నిందితుల ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు పోలీసులు. మరోవైపు, దారి తప్పుతున్న యువతను నియంత్రించాలని, హిందూ సమాజం పుంజుకుంటే దేశ వ్యతిరేకులను వదిలిపెట్టబోమని బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు కర్ణాటక ఏడీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. హింసపై విచారణ కొనసాగుతోందన్నారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. నిందితుల ఆస్తులను జప్తు చేయాలని కలెక్టర్‌కు లేఖ రాశారు.. నగరంలో తగినంత పోలీసు బలగాలను మోహరించారు. 15 ప్లటూన్లను మోహరించారు. పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు.

చాలా ప్రాంతాల్లో షాపులు మూయించేశారు. అలాగే మంగళూరులోని సూరత్‌కల్ జంక్షన్‌లో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకుంది. మంగళూరులోని సూరత్‌కల్ జంక్షన్‌లో హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పేరు మీద ఓ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. అయితే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దానిని తొలగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి