Andra Pradesh: సాగర నగరంలో సీరియల్‌ కిల్లర్‌ హల్‌చల్‌..! వారం వ్యవధిలో ఒకే తరహాలో మూడు హత్యల కలకలం..

ఈ జంట హత్యల కేసులో నిందితుణ్ని పట్టుకునేందుకు పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. వరుస హత్యలకు గల కారణాలేంటీ.? అసలు నిందితుడు ఎవరు

Andra Pradesh: సాగర నగరంలో సీరియల్‌ కిల్లర్‌ హల్‌చల్‌..! వారం వ్యవధిలో ఒకే తరహాలో మూడు హత్యల కలకలం..
Murder
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 16, 2022 | 10:31 AM

Andra Pradesh: సాగరనగరం విశాఖపట్నంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. విశాఖ చిన్నముషివాడ ప్రాంతంలో 47 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో మహిళను అతి దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు.. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుజాతనగర్‌లో ఈ హత్య జరిగింది. మృతురాలు విజయనగరం జిల్లాకు చెందిన లక్ష్మీగా గుర్తించారు. కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీ, దేముడు బాబు దంపతులు ఉపాధి నిమిత్తం విశాఖ నగరానికి వచ్చారు. వీరు నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీ దారుణ హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల ఇదే తరహాలో చిన్నముషివాడలో భార్యభర్తలు హత్యకు గురయ్యారు. అప్పారావు (60), లక్ష్మీ (55) దంపతులు సప్తగిరి నగర్‌లో సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆగస్టు 8న ఓ అపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో పడి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావు కూడా నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. ఈ జంట హత్యల కేసులో నిందితుణ్ని పట్టుకునేందుకు పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. వరుస హత్యలకు గల కారణాలేంటీ.? అసలు నిందితుడు ఎవరు అన్నది మరో రెండు మూడు రోజుల్లోనే తేలుస్తామని స్పష్టం చేశారు పెందుర్తి పోలీసులు.