Gold Price: గోల్డ్ లవర్స్‌కి పండగలాంటి వార్త.. దేశ వ్యాప్తంగా తగ్గిన బంగారం ధర.. సిల్వర్ కూడా..
Gold And Silver Price: గడిచిన రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు బుధవారం కాస్త తగ్గాయి. అంతకుముందు వరుసగా రెండు రోజులు ఏకంగా రూ. 440 పెరిగిన బంగారం ధర తర్వాత...
Gold And Silver Price: గడిచిన రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు బుధవారం కాస్త తగ్గాయి. అంతకుముందు వరుసగా రెండు రోజులు ఏకంగా రూ. 440 పెరిగిన బంగారం ధర తర్వాత స్థిరంగా కొనసాగాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం బంగారం కొనుగోలుకు డిమాండ్ ఉన్న తరుణంలో గోల్డ్ రేట్ తగ్గడం వినియోగదారులకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే ఈ తగ్గుదుల కొనసాగుతుందా లేదా ఒక్కరోజుకే పరిమితమవుతుందా.? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే బుధవారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 48,150 కాగా, 24 క్యారెట్లు రూ. 52,530 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్స్ ధర రూ. 48,000 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,360 గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,050 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,420 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,550 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్ ధర మాత్రం పెరిగింది. తులంపై రూ. 350 పెరిగి, రూ. 52,960 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,360 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,360 గా ఉంది.
* సాగర తీరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,360 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల విషయానికొస్తే..
వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 57,800గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 1400 తగ్గి రూ. 63,400 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 63,400గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 63,400 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..