AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకింగ్ దిగ్గజం.. ఇంటి వద్దే ఉచితంగా ఎస్‌బీఐ బ్యాంక్‌ సేవలు.. ఎలా పొందాలంటే..

SBI: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఖాతాదారుల కోసం బంపరాఫర్‌ను ప్రకటించింది. ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశం కల్పించింది. అయితే..

SBI: కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంకింగ్ దిగ్గజం.. ఇంటి వద్దే ఉచితంగా ఎస్‌బీఐ బ్యాంక్‌ సేవలు.. ఎలా పొందాలంటే..
Narender Vaitla
|

Updated on: Aug 17, 2022 | 8:00 AM

Share

SBI: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఖాతాదారుల కోసం బంపరాఫర్‌ను ప్రకటించింది. ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశం కల్పించింది. అయితే ఈ సేవలు కేవలం సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు మాత్రమే. బ్యాంకుకు రాలేని దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి సైతం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు ఎస్‌బీఐ తెలిపిందే. డోర్‌ స్టెప్‌ సర్వీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్‌బీఐ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. నెలకు మూడు సార్లు మాత్రమే ఈ సేవలను ఉచితంగా పొందే వీలుంటుంది.

సేవలు ఎలా పొందాంటే..

* ముందుగా యోనో యాప్‌ను ఓపెన్‌ చేయాలి. * తర్వాత సర్వీసెస్‌ రిక్వెస్ట్‌ మెనూలోకి వెళ్లాలి. * అందులో ఉండే డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్ సేవల ఆప్షన్‌ను ఎంచుకోవాలి. * రిక్వెస్ట్‌ ఆప్షన్‌ కింద ఉన్న సేవింగ్స్‌ ఖాతాను ఎంచుకుంటే అందుబాటులో ఉన్న సేవలను ఇంటి వద్దే పొందొచ్చు. మీకు కావాల్సిన సేవలను ఎంచుకుంటే బ్యాంక్‌ ప్రతినిధులు ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇలా రిజిస్టర్‌ చేసుకోండి..

డోర్‌ స్టెప్‌ సేవలు పొందడానికి ముందుగా ఖాతాదారులు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా టోల్‌ఫ్రీ నెంబర్లు 1800 1037 188 లేదా 1800 1213 721 కి కాల్ చేసి ఇంటి వద్దనే బ్యాంకింగ్ సర్వీసులను పొందేందుకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

అందుబాటులో ఉన్న సేవలు..

* క్యాష్‌ పికప్‌ * క్యాష్‌ డెలివరీ * చెక్‌ పికప్‌ * చెక్‌ రిక్వెషన్‌ స్లిప్‌ * ఫామ్‌ 15జీ/హెచ్‌ పికప్‌ * డ్రాఫ్ట్స్‌ డెలివరీ * టర్మ్‌ డిపాజిట్‌ అడ్వైజ్‌ డెలివరీ * లైప్‌ సర్టిఫికేట్‌ * కేవైసీ డాక్యుమెంట్ పికప్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..