Gupta Nidhulu: వందేళ్లనాటి పురాతన ఇంట్లో 10రోజులుగా గుప్తనిధుల తవ్వకాలు.. రెండు గదుల నిండా గుట్టలుగా..!
వీరిది వందేళ్ల కాలం నాటి పురాతన ఇళ్లు..ఇక ఇంట్లోని హాలు పక్క నుంచి వెలితే మరో గది వస్తుంది. వంటగది మధ్యలో ఉన్న ఓ గదిలో..
Gupta Nidhulu: వందేళ్లనాటి పురాతన ఇంట్లో 10రోజులుగా గుప్తనిధుల తవ్వకాలు.. రెండు గదుల నిండా గుట్టలుగా..! గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి. ఒకటి కాదు రెండు కాదు సుమారు 20 అడుగులు లోతులో ఇంట్లో నే రహస్యంగా తవ్వకాలు జరిపారు. మూడు ట్రాక్టర్ ల మట్టి గదిలోనే పోశారు. పది మంది మనుషులు పది రోజులు గా సాగిన తవ్వకాలు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారాయి. ఈ ఘటన నూజివీడు మండలం గొల్లపల్లిలో చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వేదాంతం శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో గుట్టుగా గుప్త నిధుల తవ్వకాలు చేపట్టారు. వేదాంతం ఇంట్లో ఎటు చూసిన దేవుళ్ళు, గురువుల ఫోటోలే దర్శనమిస్తాయి. వీరిడి వందేళ్ల కాలం నాటి పురాతన ఇళ్లు..ఇక ఇంట్లోని హాలు పక్క నుంచి వెలితే మరో గది వస్తుంది. వంటగది మధ్యలో ఉన్న ఓ గదిలో తవ్వకాలు జరిగాయి. దానికి ఆనుకున్న రెండుగదుల్లోనూ మట్టి పోశారు. గత కొంత కాలంగా రెండుచోట్ల ఈ ఇంట్లో తవ్వకాలు జరిపారు.
ఏలూరు జిల్లాలో జరిగిన ఈ గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో ఏకంగా ఓ ఇంట్లోనే గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం భయాందోళనలు రేపింది. ఊరు మధ్యలో వేదాద్రి శ్రీనివాసరావు ఇంట్లో జరిపిన ఈ తవ్వకాలు గ్రామంలో టెన్షన్ పుట్టించాయి. తన ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయంటూ తవ్వకాలు జరిపించాడు వేదాద్రి శ్రీనివాసరావు. ఇంటి మధ్యలో 20 అడుగుల మేర భారీ గొయ్య తవ్వించాడు.
ఇంట్లో పెద్ధ పెద్ధ శబ్ధాలు వస్తుండటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వేదాంతం శ్రీనివాసరావు సహా ఐదుగురు ని అదుపులోకి తీసుకుని నిందితులను విచారిస్తున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరెవరూ ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి