Telugu News Trending Woman injured in a accident while she walking on road side video was gone viral in social media Telugu viral News
Viral Video: రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నారా.. ఇలాంటి ప్రమాదాలు కూడా జరగొచ్చు.. ఆదమరిస్తే అంతే సంగతులు
ప్రమాదాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదు. అందుకే రోడ్డుపై నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై నడుస్తున్నా యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి.. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. అలా ప్రమాదాలకు సంబంధించిన...
ప్రమాదాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదు. అందుకే రోడ్డుపై నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై నడుస్తున్నా యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి.. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. అలా ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొన్నిసార్లు పాదచారులు కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డు పక్కన హాయిగా నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఒక్కసారిగా వెనుక నుంచి ఓ ట్రక్కు వచ్చి ఢీకొట్టింది. ఆ మహిళ రోడ్డు పక్కన నడుస్తుండటం, నడుచుకుంటూ వెళ్తూ పక్కనే పార్క్ చేసిన కారు దగ్గరకు చేరుకోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఇంతలో, ఒక ట్రక్ అక్కడికి చేరుకుంటుంది, దాని బ్యాక్ డోర్ కు లాక్ వేసి ఉండక పోవడంతో అది కుదుపునకు గురై మహిళను ఢీ కొట్టింది. ఈ ఘటన చాలా బలంగా జరగడంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని తేల్చారు. ఈ వీడియో చూశాక రోడ్డు భద్రత నియమాలు ఎందుకు పాటించాలో కచ్చితంగా అర్థమవుతుంది.
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో క్రేజీ ట్వీట్స్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘రాంగ్ ప్లేస్, రాంగ్ టైమ్’ అనే క్యాప్షన్‌తో ఉంది. ఈ 13 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 20 వేలకు వ్యూస్, వందలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూశాక నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు ఇస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..